అనుష్క సినిమాలో అనసూయకు ఛాన్స్

By Srikanya

హైదరాబాద్ : హాట్ అండ్ సెక్సీ యాంకర్ అనసూయ మరో సారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి ఆమె ఓ చిత్రంలో బుక్కైందంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో ఆమె చర్చనీయాంశమైంది. అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనసూయని ఓ కీలకమైన పాత్రకు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. రాజసం ఉట్టిపడే పాత్రలో ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు.

గతంలో ఆమె పవన్ కళ్యాణ్ తాజా చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అయితే సినిమా రిలీజయ్యాక తాను ఎందుకు నచించనన్నానో అంటూ ట్వీట్ చేసి తన ఫ్యాన్స్ కు అసలు కారణం వివరించే ప్రయత్నం చేసింది.

Hot Anasuya In 'Rudramadevi'

ఇక రుద్రమదేవి చిత్రం విషయానికి వస్తే... ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్. 'రుద్రమదేవి'కోసం భారీ సెట్...డిటేల్స్ అనుష్క ప్ భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X