మహేష్‌కి, శృంగార ‘బిజినెస్’కి సంబంధమేంటి?
మహేష్ బాబు హీరోగా వచ్చిన 'బిజినెస్ మేన్' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం పలు రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ భవిష్యత్‌లో 'బిజినెస్ మేన్-2' చిత్రాన్ని కూడా తీసే ఆలోచనలో ఉన్నాడు.
కాగా...మహేష్ బాబు బిజినెస్ మేన్ చిత్రాకి వచ్చిన ఫేత్‌ను ఓ శృంగార చిత్రానికి వాడుకుంటున్నారు. బిజినెస్ మేన్ సినిమా టైటిల్ లోగోని తలపించేలా దానికి 'బిజినెస్ ఉమెన్-2' అని పేరు పెట్టారు. ఇది పక్కా పెద్దలకు మాత్రమే పరిమితం అయిన శృంగార చిత్రం. హిందీలో ప్లాప్ అయిన ఆ చిత్రాన్ని తెలుగులో 'బిజినెస్ ఉమన్-2'గా విడుదల చేస్తున్నారు.
త్వరలో బి, సి సెంటర్లను టార్గెట్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'బిజినెస్ మేన్' సినిమా టైటిల్‌లా 'బిజినెస్ ఉమన్' టైటిల్ ఉండటంతో ఎంతో కొంత తమ సినిమాకు లాభం జరుగుతుందని భావిస్తున్నారట నిర్మాతలు.
మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చిత్రంలో నటిస్తున్నాడు. దసరా వరకు ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











