twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ సరసన హన్సిక ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ కొత్త చిత్రం త్వరలో భారీ ఎత్తున లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బలుపు చిత్రానికి కథ అందించిన బాబి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హన్సికను ఎంపిక చేసినట్లు సమాచారం. రవితేజ..బలుపు చిత్రం తోటే ప్లాప్స్ నుంచి బయిట పడ్డారు. ఇప్పుడీ చిత్రం కూడా పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని సమాచారం.

    బలుపు హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బలపు రచయిత...బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మిస్తారనుకున్నారు. అయితే తాను అంత బడ్జెట్ పెట్టలేనని చేతులు ఎత్తేయటంతో రాక్ లైన్ వెంకటేష్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తోంది. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.

    వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

    ఇక 'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

    హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.సుందర్.సి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇవన్నీ చూస్తుంటే గతంలో చెప్పినట్టుగా పెళ్లిచేసుకొని వెళ్లిపోయే ఆలోచన వాయిదా వేసినట్లు కనపడుతోంది. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వెళితే మరో రెండు సంవత్సరాలన్నా సరిపోతాయి. మొత్తానికి పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

    English summary
    Hansika has made her choice and the person who gets to walk away with the newly slim beauty is mass Maharaja Raviteja. Yes, the Balupu actor has been paired up with the Dhenikaina Ready actress for an upcoming film. Balupu writer K S Ravindra aka Bobby will make his directorial debut with this pair, for the film being produced by Rockline Venkatesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X