దర్శకుడుతో ప్రేమలో గోదావరి పిల్ల నీతూ చంద్ర?
శేఖర్ కమ్ముల గోదావరిలో సుమంత్ కి మరదలు చేసిన నీతూ చంద్ర జగ్ మోహన్ ముద్ర అనే బాలీవుడ్ డైరక్టర్ తో వ్యవహారం నడుపుతోందంటూ ముంబై పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ రీసెంట్ గా ఓ హిందీ చిత్రం ప్రీమియర్ కి అటెండయిన వీరు అనంతరం చేయి, చేయి కలుపుకుని ఒకే కారు ఎక్కి వెళ్ళిపోతూ కెమెరాలకు దొరికిపోయారు.రాత్రి ఒంటిగంటన్నరకు అలా కలిసి వెళ్ళటం అందరికీ హాట్ టాపిక్కే కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇంటర్వెల్ సమంయలో నీతూ చంద్ర మీడియాకు ఫోజ్ లు ఇస్తూంటే జగ్ మోహన్ చాలా ఓపికగా ఎదురుచూస్తూ నిలబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం వారిద్దరూ అపార్ట్ మెంట్ అనే చిత్రంలో కలిసిపనిచేస్తున్నారు. ఆ ప్రొపేషనల్ రిలేషన్ తప్ప మా మధ్య ఏమీ లేదని ఇద్దరూ విడివిడిగా స్టేట్ మెంట్స్ ఇవ్వటం కొసమెరుపు.
నీతూ చంద్ర గోదావరి శేఖర్ కమ్ముల సుమంత్ 13 బి జగ్ మోహన్ ముద్ర neetu chandra godavari shekar kammula sumanth 13b jagmohan mudra


Click it and Unblock the Notifications