ఆర్తి అతనితో తిరుగుళ్లు?
కాపురం వదిలేసి రీఎంట్రి ఇచ్చి ఆఫర్స్ పట్టుకుంటున్న ఆర్తి అగర్వాల్ ప్రవర్తన ఏం బాగోలేదని పరిశ్రమవర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆమె తన పర్శనల్ అసెస్టెంట్ గా ఉంటున్న వ్యక్తితో కలిసితిరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ కలిసి షాపింగులు, పబ్ లు అంటూ ఎక్కడ చూసిన వారే ఉంటున్నారని చెప్తున్నారు. అలాగే నటనలో ఇంతకుముందు ఉన్న డెడికేషన్ ఇప్పుడు లేదని అంటున్నారు. అంతేగాక ఆమె భర్త అమెరికాలో ఉంటే ఇక్కడ ఈమె తిరుగుళ్ళేమిటని అంటున్నారు. అయితే ఈ వార్తలు ఏమీ పట్టించుకునే స్దితిలో ఆమె లేదంటున్నారు.
నువ్వు నాకు నచ్చావ్ నుంచి అందాల రాముడు వరకూ వరస హిట్లతో దూసుకెళ్ళిన ఆర్తి అగర్వాల్ ఆ మధ్య పెళ్లి చేసుకుని వేషాలకు దూరమైంది. అయితే అమెరికాలో సెటిలయినా దృష్టంతా ఇక్కడే ఉండటంతో మళ్ళీ టాలీవుడ్ కి తరలి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు వేషాలివ్వండని రిక్వెస్ట్ చేసింది. పోసాని, భరత్ వంటి వారు ఆమెను ఎంకరేజ్ చేస్తూ అడ్వాన్స్ లు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నీలవేణి చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











