ప్రభాస్‌పై ‘ఆర్ఆర్ఆర్’ రూమర్... నిజంగా రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నాడా?

Recommended Video

Prabhas To Play Cameo In Rajamouli's RRR ? | Filmibeat Telugu

'బాహుబలి' లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట.

ఈ బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయడంపై ఇటు రాజమౌళి నుంచి కానీ, అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

ప్రభాస్-రాజమౌళి

ప్రభాస్-రాజమౌళి

ప్రభాస్, రాజమౌళి ఇంతకు ముందు ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు కలిపి పని చేశారు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్'లో ప్రభాస్ గెస్ట్ రోల్ ఉంటే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని రాజమౌళి భావిస్తున్నారట.

ఇంకా హీరోయిన్స్ దొరకలేదు

ఇంకా హీరోయిన్స్ దొరకలేదు

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లు ఎవరు? అనేది ఫైనల్ కాలేదు. ఫిల్మ్ నగర్ రూమర్స్ ప్రకారం... రాజమౌళి ఇటీవల బాలీవుడ్ నటి అలియా భట్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో పరిణీతి చోప్రా పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ప్రభాస్ బిజీ బిజీ

ప్రభాస్ బిజీ బిజీ

ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో'తో పాటు ‘జిల్'ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ‘సాహో' మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X