జెడి చక్రవర్తి 'కాంట్రాక్ట్‌' లో అదిరిపోయే సెక్స్ బాంబ్

By Srikanya

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, జెడి చక్రవర్తి కాంబినేషన్‌లో త్వరలో ఈ 'కాంట్రాక్ట్‌' టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ లో సెక్సీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మినీషా లంబాని ఎంపిక చేసినట్లు సమాచారం. కిడ్నాప్, బచానే సే హసీనో చిత్రాలతో హిందీ తెరని వేడిక్కించిన ఆమె తెలుగులో ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వటం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కలిగేలా చేస్తోంది. ఇక వర్మ కార్పొరేషన్‌లో జెడి చక్రవర్తి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్.ఎస్.సమీర్ నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి సమీర్‌ మాట్లాడుతూ-యాక్షన్‌ బేసెడ్ ప్రేమకథ ఇది. దేశ విదేశాల్లో విభిన్న ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ చేస్తాం. త్వరలోనే ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుంది. ఇదిలా ఉంటే త్వరలో జెడి చక్రవర్తి...తమిళ స్టార్ హీరో విక్రమ్ ని డైరక్ట్ చేయనున్నారు. అలాగే ఆ చిత్రంలో మరో హీరోగా నేను దేవుడ్ని ఫేం ఆర్య (వరుడు ఫేమ్) కూడా చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని గతంలో సర్వం చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు నిర్మిస్తారు. ఇక తెలుగులో జెడి చక్రవర్తి..హోమం, సిద్దం చిత్రాలను డైరక్ట్ చేసారు. ప్రస్తుతం జెడి చక్రవర్తి తెలుగు లో మనీ మనీ మోర్ మనీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X