పూరీ జగన్నాధ్ క్యాంప్ లో హాట్ గర్ల్ తాప్సీ
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయం అయి ఆ తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన తాప్సీకి పూరీ జగన్నాధ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే అది తెలుగు చిత్రం కాదని బాలీవుడ్ చిత్రమని తెలుస్తోంది. అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం బుడ్డలో ఈ ఆఫర్ ఆమెకు దక్కింది. ఈ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి నెలాఖరున ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











