పాపం..ముంబయికి రైలెక్కిన హాట్ హీరోయిన్
మాయాజాలం వంటి చిత్రంతో పరిచయమై వినాయకుడు తో పాపులర్ అయిన పూనం కౌర్ కి కలసిరాక పోవటంతో ముంబయి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్ధితి వచ్చింది. మొన్నటిదాకా హైదరాబాద్ అమీర్ పేట్ లో మకాం పెట్టి అవకాశాల కోసం ఎక్కే గుమ్మం,దిగే గుమ్మం అన్నట్లున్న ఈ ముద్దు గుమ్మకి ముంబయిలో ఉంటేనే డిమాండ్ క్రేజ్ అని అర్దమైందిట. దాంతో తట్టా,బుట్టా సర్దుకుని నాకు బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది.ముంబయి వెళ్తున్నా..ఏదన్నా ఛాన్స్ ఉంటే ఫోన్ చేయండి అని మెసేజ్ లు ఎస్.ఎమ్.ఎస్ లు చేసి మరీ చెక్కేసింది. వినాయకుడు హిట్టవటంతో ఆమె మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని ఆశించింది. అయితే ఆపర్ ఇస్తాను అనే వారే కానీ ఆ ప్రామిస్ ని నిలబెట్టుకునే వారు ఆమెకు కనపడలేదుట. దాంతో విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.
వినాయకుడు ముంబయి అమీర్ పేట బాలీవుడ్ కృష్ణారెడ్డి పూనం కౌర్ మాయాజాలం poonam kour mayajalam vinayakudu mumbai bollywood krishnudu


Click it and Unblock the Notifications