#మీటూ గురించి అల్లు అర్జున్.... మరోసారి శ్రీరెడ్డి సంచలనం!
కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు నటీమణులు డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతలు తమను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇటీవల 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంటులో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ మూవీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బన్నీ.... #మీటూ ఉద్యమం గురించి ప్రస్తావించారు.

మీటూ: టాలీవుడ్ చాలా క్లీన్ అని చెప్పిన అల్లు అర్జున్
ప్రియాంక జవాల్కర్ మరాఠి అమ్మాయి అయినప్పటికీ అనంతపూర్లో పెరిగింది అని తెలిసింది. తెలుగుతనాన్ని ఇష్టపడే ఎవరైనా తెలుగువారే. ఇలాంటి ఆడపిల్లలు రావాలి. చాలా కాన్ఫిడెన్స్‌తో రావాలి. ఈ మధ్య మీటూ మూమెంట్స్ అని వచ్చాయి. ఈ నేపథ్యంలో నేను ఓ విషయం స్పష్టంగా చెబుతున్నాను. అన్ని సినీ ఇండస్ట్రీల్లో క్లీనెస్ట్ ఇండస్ట్రీ, అమ్మాయిలకు మాగ్జిమమ్ రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ... అని అల్లు అర్జున్ అన్నారు.

ఇన్నాళ్లు టాలీవుడ్లో జరిగిన ఆందోళనల సంగతి ఏమిటి?
కొన్ని రోజుల క్రితం టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలువురు నటీమణులు టాలీవుడ్లోనూ లైంగికంగా వేధించే వారు ఉన్నారని స్టేట్మెంట్స్ ఇచ్చారు. శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చి పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ ఓ రేంజికి తీసుకెళ్లింది. అల్లు అర్జున్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంతకాలం కాస్టింగ్ కౌచ్ పేరెతో జరిగిన ఆందోళనల సంగతి ఏమిటనే వాదన తెరపైకి వచ్చింది.

మీడియా సాక్షిగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమా అవకాశాలు ఇస్తామని మాయమాటలు చెప్పి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను లైంగికంగా లొంగదీసుకున్నారనే అంశంపై మీడియాలో అప్పట్లో వరుసగా చర్చా కార్యక్రమాలు సైతం జరిగిన సంగతి తెలిసిందే.
మరోసారి శ్రీరెడ్డి హాట్ కామెంట్స్
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. నీకు అమ్మాయిలంటే లోకువ. నన్ను టార్గెట్ చేసి ఏడిపించిన విషయం మరిచిపోను. నీ పతనం త్వరలో చూస్తానని ఆశిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే శ్రీరెడ్డి ఎవరి గురించి ఈ కామెంట్స్ చేసిందో అర్థం కావడం లేదు.


Click it and Unblock the Notifications











