అల్లు అర్జున్ కొత్త బిజినెస్.. స్టైలిష్ స్టార్ ఆ పని చేయడమా? ఆశ్చర్యంగా ఉందే!!
నేటితరం హీరోలు వృత్తిపరంగా ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటేనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నాగ శౌర్య లాంటి యంగ్ హీరోలు సొంతంగా వ్యాపార కార్యకలాపాలు నివహిస్తుండగా తాజాగా అదే బాటలోకి అల్లు అర్జున్ కూడా ఎంటర్ అవుతున్నారని తెలిసింది. వివరాల్లోకి పోతే..

అల.. వైకుంఠపురములో జోష్.. కొత్త వ్యాపారం
ప్రస్తుతం అల్లు అర్జున్, అల.. వైకుంఠపురములో సక్సెస్ జోష్ లో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్- పూజా హెగ్డే జంటగా రూపొందిన ఈ మూవీ 2020కి కిక్ స్టార్ట్ ఇస్తూ రికార్డుల సునామీ సృష్టించింది. దీంతో ఇదే జోష్‌లో అల్లు అర్జున్ కొత్త వ్యాపారం మొదలు పెట్టారట.

కార్ల కంపెనీలో బన్నీ భాగస్వామ్యం
ప్రముఖుల ఇంట్లో శుభకార్యాలకు దేశంలోని ఇతరత్రా నగరాల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడమనేది కామన్. అలాంటి సందర్భంలో వారి ప్రయాణానికి అనువుగా ఖరీదైన కార్ల అవసరం ఉంటుంది. ఇట్టి కార్లను అద్దెకు ఇచ్చే ఓ కంపెనీలో అల్లు అర్జున్ భాగస్వామ్యం తీసుకున్నారని తెలుస్తోంది.

7 శాతం వాటా.. ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా
ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి 7 శాతం వాటా తీసుకున్నారట అల్లు అర్జున్. ఈయనతో పాటు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఇందులో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలిసి బన్నీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సినిమాలతో సంబంధం లేని రంగంలో అల్లు అర్జున్ ఎంటర్ కావడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్‌తో అల్లు అర్జున్..
ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా కొన్నిరోజుల పాటు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











