»   » కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినీ రంగంలో కులాంతర, మతాంతర వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సాంప్రదాయం ఇప్పుడు మొదలైంది కాకపోయినా..... ప్రస్తుతం టాలీవుడ్లో యువహీరోలంతా వరుసపెట్టి కులాంతర వివాహాలు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.

రామ్ చరణ్, బన్నీ, మంచు విష్ణు, మంచు మనోజ్....తదితరులు ఇప్పటికే కులాంతార వివాహాలు చేసుకున్నారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న అఖిల్ కూడా వారిదారిలోనే నడుస్తున్నాడు. అయితే వీరంతా పెళ్లాడిన, పెళ్లాడబోతున్న అమ్మాయిలు.... రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇపుడు ఈ విషయం తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది.

హీరోలు, వారిని పెళ్లాడిన అమ్మాయిలకు కులాల పట్టింపు లేక పోయినా.... మీడియాలో మాత్రం దీని గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఇంకా మన సమాజం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రాజకీయాల్లో కులాల ప్రభావం బాగా ఉంది. ఈ నేపథ్యంలో...... ఇలాంటి అంశాలపై పాఠకుల్లో కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి అంశాలపై మీడియా సంస్థలు బాగా ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రామ్ చరణ్-ఉపాసన రెడ్డి

రామ్ చరణ్-ఉపాసన రెడ్డి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..... అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు ఉపాసన రెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం.

అల్లు అర్జున్-స్నేహారెడ్డి

అల్లు అర్జున్-స్నేహారెడ్డి

అల్లు అర్జున్ పెళ్లాడిన స్నేహా రెడ్డి విద్యారంగంలో పేరున్న వ్యాపారవేత్త కేసీ శేఖర్‌రెడ్డి కుమార్తె.... వీరిది కూడా ప్రేమ వివాహం. ఇద్దరూ పెద్దలను ఒప్పించి ఈ వివాహం చేసుకున్నారు.

మంచు విష్ణు-వెరోనికా రెడ్డి

మంచు విష్ణు-వెరోనికా రెడ్డి

మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు.... స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని వివాహమాడిన సంగతి తెలిసిందే.

మంచు మనోజ్-ప్రణతి రెడ్డి

మంచు మనోజ్-ప్రణతి రెడ్డి

ఇక మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా....ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే. కులాంతర వివాహం అయినా ఇరు వర్గాల నుండి అంగీకారం రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోయింది.

తారకరత్న-అలేఖ్య రెడ్డి

తారకరత్న-అలేఖ్య రెడ్డి

స్వర్గీయ ఎన్టీఆర్.... వారసత్వంతో సినీ రంగంలోకి వచ్చిన ఆయన మనవళ్లలో ఒకరైన తారకరత్న సైతం అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానిిక పెద్దల అభ్యంతరం ఉండటంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు.

గౌతమ్-జ్యోత్స్న రెడ్డి

గౌతమ్-జ్యోత్స్న రెడ్డి

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె జ్యోత్స్న రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

అఖిల్-శ్రీయభూపాల్ రెడ్డి

అఖిల్-శ్రీయభూపాల్ రెడ్డి

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ జీవీకే సంస్థల వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ రెడ్డిని పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం ఇటలీలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది

అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది

డిసెంబర్ 9న జరగనున్న వీరి నిశ్చితార్దం జరగనుంది. ఈ కార్డ్ బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ కార్డ్ సింపుల్ గా చూడటానికి చాలా ముచ్చటగా బాగుంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య

అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య

అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున...

కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున...

కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున... (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Actor Akhil is in a long term relationship with fashion designer Shriya Bhupal. Akhil’s ladylove Shriya is the daughter of industrialist Shalini Bhupal and granddaughter of GVK Group’s head GVK Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu