హాట్ టాపిక్ : పవన్ కళ్యాణ్ ఒంటిపై జంధ్యం?(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : ఆదివారం జరిగిన ‘గోపాల గోపాల' ఆడియో వేడుకకు వచ్చి గాయపడిన తన అభిమాని కరుణ శ్రీనివాస్‌ను, అతని కుటుంబ సభ్యులను మంగళవారం ఉదయం తన కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు, వీడియోలు మీడియోలో వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో పవన్ కళ్యాణ్ మెళ్లో జంద్యం (యజ్ఝోపవీతం) ఉండటం ఇప్పుడు మీడియో వర్గాల్లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే అది జంధ్యమేనా కాదేమో... వేరేదేమో చూసి జంధ్యం అని భ్రమ పడుతున్నారేమో అని మరికొందరు అంటున్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఇక పవన్ కళ్యాణ్ , వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గోపాల గోపాల'. ఈ సినిమా ఆడియో లాంచ్ జనవరి 4న జరిగింది. ఈ ఆడియో వేడుకలో ఓ బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. అదే కొందరు ఆగంతకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన ఒకటని గొంతుకోసి పారిపోయారు. అతనికి ప్రాణాపాయం తప్పినా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Hot Topic:Pawan Kalyan wearing Jandhyam?

ఈ విషయంపై పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. పోలీసులు అక్కడ ఉన్న పబ్లిక్ ని విచారించారు. అలాగే మీలో ఎవరన్నా అక్కడ జరిగిన దారుణాన్ని చూసి ఉంటే, 9493549415 నెంబర్ కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయండి. ఆ రోజు గొడవ ఆడియో లాంచ్ పాస్ ల విషయంలో జరిగిందని అంటున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. వెళ్లి కలిసారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

గోపాల గోపాల విషయానికి వస్తే.... షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందివ్వడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ చిత్ర టీం ఈ రోజు ఈ సినిమాని సెన్సార్ చేయిస్తోంది. జనవరి 4న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు.

పవన్ కళ్యాణ్ కూడా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్' కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు - శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం సినిమాని జనవరి 9 లేదా 10న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటోంది.

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. '' అని తెలిపారు.

శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్క్రీన్ ప్లే ను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

చిత్రం కథ విషయానికి వస్తే..

దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నడిపే బైక్ కు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బైక్ తోనే పోస్టర్స్ నిసైతం విడుదల చేసారు. తాజా సమాచారం ఏమిటంటే..ఆ బైక్ ని ప్రీమియర్ షో కు ప్రదర్శనలో పెడతారని తెలుస్తోంది. ఆ షోలో ఆ బైక్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X