Don't Miss!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఫిక్స్ చేసిన కొరటాల.. సేమ్ ఫార్ములా అంటున్న శ్రీను వైట్ల.. స్టార్ హీరోలతో భారీ స్కెచ్!!
డైరెక్టర్ శ్రీను వైట్ల.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్స్ ఖాతాలో వేసుకొని తన మార్క్ చెరిపేసుకున్నాడు. టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన హిట్ ముత్తారం పడటం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబులతో మెగా ప్లాన్ రెడీ చేశారట శ్రీను వైట్ల. వివరాల్లోకి పోతే..
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా..
స్టార్ హీరోలతో సినిమాలు చేసి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా, ఉన్నటుండి ఫ్లాపులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయాడు శ్రీను వైట్ల. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'దూకుడు' లాంటి సూపర్ ఎంటర్టైనర్ అందించి ఆ తర్వాత డీలా పడ్డాడు. దూకుడు తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టాయి.
Recommended Video
ఇక లాభం లేదని.. ఆ ఇద్దరినీ కలిసిన డైరెక్టర్
ఇటీవలే రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోనీ'ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి సక్సెస్ రాబట్టాలని భారీ ప్రయత్నం చేసినా అది కూడా విఫలమైంది. ఈ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఇక తనకు హిట్ ఇచ్చిన హీరోలనే నమ్ముకోవాలని డిసైడ్ అయిన శ్రీను వైట్ల.. ఇటు మహేష్ బాబు, అటు చిరంజీవిలు కలిసినట్లు తాజా సమాచారం.
మహేష్, చిరులకు కథ చెప్పిన శ్రీను వైట్ల
దూకుడుకి సీక్వెల్‌గా ఓ కథను సిద్ధం చేసిన శ్రీను వైట్ల.. ఆ కథను మహేష్ కి వినిపించడం కూడా జరిగిందనేది తాజా అప్డేట్. అయితే ఈ కథ విన్న మహేష్.. కాస్త టైమ్ తీసుకొని ఓకే చెబుతానని శ్రీనుకి మాటిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవిని కూడా కలిసిన శ్రీను వైట్ల, మెగాస్టార్ రేంజ్ లో ఓ పవర్ ఫుల్ కథ వినిపించాడట.
ఇద్దరికీ ఒకే కథ.. వర్కవుటయ్యేనా?
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చిరుకి శ్రీను వైట్ల చెప్పిన కథలో ఇద్దరు హీరోలకు స్కోప్ ఉందని తెలుస్తోంది. ఇలా చిరు, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ కథకు ప్లాన్ చేసిన శ్రీనువైట్ల.. ఆ కథే ఇద్దరికీ చెప్పారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న శ్రీను వైట్లకి ఈ హీరోలు ఛాన్స్ ఇస్తారా అనేది కాస్త సందేహమే.
కొరటాల ఫిక్స్ చేశాడు.. అభిమానుల్లో ఆతృత
ఇకపోతే చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న చిరు 152 లో మహేష్ బాబు గెస్ట్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు కూడా. దీంతో ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని ఇటు మెగా అభిమానులు, అటు ఘట్టమనేని అభిమానులు ఆతృతగా ఉన్నారు.