»   » నిర్మాతలను కొత్తగా మోసం చేస్తున్నాడు: ఎవరా తెలుగు స్టార్ హీరో?

నిర్మాతలను కొత్తగా మోసం చేస్తున్నాడు: ఎవరా తెలుగు స్టార్ హీరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఒక సినిమా మొదలవ్వడానికి ముందు వ్యవహారాలన్నీ దాదాపుగా నమ్మకం మీదనే కొనసాగుతుంటాయి. ఒక స్టార్ హీరో లేదా డైరెక్టర్ ఒక నిర్మాతకు సినిమా చేస్తానని మాట ఇవ్వడం, వారిపై నమ్మకంతో నిర్మాత వారికి కొంత అడ్వాన్సుగా కొంత డబ్బు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే వ్యవహారాలే..

ఇలా అడ్వాన్స్ ఇచ్చే వషయంలో ఎలాంటి పేపర్ అగ్రిమెంట్లు ఏమీ ఉండవు, కేవలం నమ్మకం మీదే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అగ్రిమెంట్లు అయిందంటే సినిమా మొదలవుతుందని అర్థం. చాలా మంది హీరోలు, దర్శకులు తమ మాట నిలబెట్టుకోవడానికి వంద శాతం ప్రయత్నిస్తారు.

కొన్ని సందర్భాల్లో హీరోలు, దర్శకులు అంతకంటే బెటర్ ఆఫర్స్ వచ్చినా తమ మాట నిలబెట్టుకునే ప్రతయ్నం చేస్తారు. ఒక వేళ నిర్మాత తనకు తానుగా ఆర్థిక ఇబ్బందులతో సినిమాను ఆపేస్తే తప్ప ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు.

అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ స్టార్ హీరో (పేరు బయట పెడితే గొడవలైపోతాయ్) కావాలనే నిర్మాతలతో ఆడుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. వారితో సినిమాలు చేస్తానని భారీగా డబ్బు అడ్వాన్సుగా తీసుకోవడం, నెలలు, కొన్ని సార్లు సంవత్సరాలు ఆ డబ్బును తన ఫైనాన్షియల్ అవసరాలకు వాడుకోవడం, తర్వాత బెటర్ ఆఫర్ రాగానే పాత నిర్మాతకు టాటా చెప్పేయడం లాంటివి చేస్తున్నాడట.

చాలా మంది బాధితులు..

చాలా మంది బాధితులు..

ఇలాంటివి ఒకటి రెండు సందర్బాల్లో జరిగేతే ఏమో అనుకోవచ్చు కానీ... పరిశ్రమలో ఈ హీరో బాధిత నిర్మాతలు చాలా మందే ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వడ్డీలు తెచ్చి

వడ్డీలు తెచ్చి

సినిమా చేస్తాడనే నమ్మకంతో కొందరు నిర్మాతలు వడ్డీలక తెచ్చిమరీ సదరు హీరోకు అడ్వాన్సులు ఇస్తున్నారు. అయితే సినిమా చేస్తానంటూ తమ డబ్బును నెలలు, సంవత్సరాలు వాడుకుని... సినిమా చేయకుండా మోసం చేస్తాడని, కనీసం ఎలాంటి వడ్డీ కూడా చెల్లించడం లేదని వాపోతున్నారు.

మోసగాడు..

మోసగాడు..

ఇపుడు ఆ హీరోను నిర్మాతలంతా మోసగాడు అంటూ మండిపడుతున్నారు. అయితే ఆ హీరో పేరు బహిరంగంగా బయట పెట్టడానికి జంకుతున్నారు.

నమ్మకం పోతే అంతే..

నమ్మకం పోతే అంతే..

అయితే సినీ పరిశ్రమలో నమ్మకం పోగొట్టుకున్న హీరోలు పైకొచ్చిన దాఖలాలు లేవు. ఈ హీరో పరిస్థితి కూడా కొంతకాలం తర్వాత అలానే అవుతుందని అంటున్నారు.

English summary
As per film circles this one of the tollywood top hero accepts advance from any producer that approaches him. He makes them wait for years and finally returns that money without doing a film for them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X