భాగ్యశ్రీ బోర్సేని వెంటాడిన దురదృష్టం.. హిట్ సినిమాను వదులుకుని, డిజాస్టర్‌ మూవీతో

సినీ రంగంలో వెలిగిపోదామని వచ్చే వారికి గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సూత్రం బాగా వర్తిస్తుంటుంది. అందం, అభినయం ఉండి కూడా చాలా మంది హీరోయిన్లు అడ్రస్ లేకుండాపోయారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం ఓవర్‌నైట్ స్టార్‌‌డమ్ సంపాదిస్తుంటారు. పదులకొద్ది సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. సింగిల్ మూవీకే కొందరికీ దక్కుతూ ఉంటుంది. దీనిని లక్ అంటారు.

ఈ కోవలోకే వస్తారు మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించారు. భాగ్యశ్రీకి ఇదే తొలి తెలుగు సినిమా. అయితే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే ఆమెకు ఆఫర్లు క్యూకట్టాయి. మంచి హైట్, దానికి తగ్గ రూపం, హాట్ లుక్స్ ఉండటం భాగ్యశ్రీకి కలిసొచ్చే అంశం. మిస్టర్ బచ్చన్‌లో ఆమె అందాలను అద్భుతంగా చూపించారు హరీష్ శంకర్. టీజర్, ట్రైలర్, పోస్టర్లలో భాగ్యశ్రీ నడము, నాభి అందాలే దర్శనమిచ్చి కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.

how actress bhagyashri Borse missed the blockbuster telugu movie AAY here s the details

కట్ చేస్తే .. ఆగస్ట్ 15న రిలీజైన మిస్టర్ బచ్చన్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. లాంగ్ వీకెండ్ ఉన్న గత వారమే కలెక్షన్లు అంతంత మాత్రంగా వచ్చాయని , మరి రెగ్యులర్ వీక్‌లో ఈ బొమ్మ పరిస్ధితేంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా కంటే పాటలే అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు దర్శకుడు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. రవితేజ వీరాభిమానులైతే.. సినిమా కోసం పాటలు తీశారా, పాటల కోసం సినిమా తీశారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా ఉన్నా.. భాగ్యశ్రీ బోర్సేకు మంచి మార్కులే పడ్డాయి. ఇక్కడి వరకు ఆమెను అదృష్టం బాగానే కాపాడింది. అయితే భాగ్యశ్రీ చేసిన బ్లండర్ మిస్టేక్‌ ఆమెకు తొలి సినిమా డిజాస్టర్ రూపంలో వెల్‌కమ్ చెప్పినట్లయ్యింది. నిజానికి భాగ్యశ్రీ లక్ ఆమెను నీడలా కాపాడి.. మంచి ట్రాక్‌లో నిలబెట్టింది, ఆమెకు చేయాల్సిన ఫస్ట్ తెలుగు మూవీ బ్లాక్ బస్టర్‌గానే నిలిచింది. కాకపోతే భాగ్యశ్రీయే చేజేతులా ఆ ఆఫర్‌ను వదుకుంది. ఆ సినిమాయే ఆయ్.

how actress bhagyashri Borse missed the blockbuster telugu movie AAY here s the details

ఆగస్ట్ 15న బడా సినిమాలు, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన మూవీస్ మధ్యలో టఫ్ పోటీలో విడుదలైంది ఆయ్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో , కామెడీ, లవ్, కుటుంబ బంధాలు, స్నేహం ఇతివృత్తంగా వచ్చిన ఈ సినిమా ఆగస్ట్ 15 విజేతగా నిలిచింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడటంతో పాటు వసూళ్లలోనూ దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేనే తీసుకుని, కొంత శిక్షణ కూడా ఇచ్చారట.

ఆలోపు హరీష్ శంకర్ నుంచి కబురు రావడంతో రవితేజ వంటి పెద్ద హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ దొరకడంతో ఆయ్‌ని భాగ్యశ్రీ పక్కనపెట్టారట. కట్ చేస్తే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఫర్వాలేదనిపించుకోగా.. ఆయ్ మాత్రం బ్లాక్‌బస్టర్ నిలిచింది. దీంతో నెటిజన్లు ఆమె డిసెషిన్‌పై ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమాను వదులుకుని.. డిజాస్టర్ మూవీని సెలెక్ట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X