పూరీ జగన్నాధ్ రెమ్యునేషన్ ఎంత?
హైదరాబాద్ : మొన్న శుక్రవారం నాడు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం నిర్మాత డివివి దానయ్య పై పూరీ జగన్ తనకు రెమ్యునేషన్ ఎగ్గొట్టారని కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగున్నర కోట్ల రూపాయలు తనకు ఇవ్వలేదని ఆ కంప్లైంట్ లో ఆయన రాసారు. ఈ కంప్లైంట్ ని ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ అశోశియేషన్ వారు ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫార్వడ్ చేసారు. నిర్మాతల మండలిలో ఆయన కంప్లైంట్ చేసారు. ఈ విషయమై దిల్ రాజు చొరవతో మరికొందరు సినీ పెద్దల సహకారంతో పరిష్కారం దొరికినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో అసలు పూరీ జగన్నాధ్ రెమ్యునేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో వినపడుతున్నదాన్ని బట్టి పూరీ జగన్నాధ్ రెమ్యునేషన్...10 నుంచి 11 కోట్లు. కొంత ప్రారంభానికి ముందు ఇచ్చి ఎగ్రమెంట్ చేసుకుని సినిమా పూర్తయ్యేలోపల విడతల విడతలగా మిగతా ఎమౌంట్ సెటిల్ చేస్తారు. అయితే దర్శకుడుకి ఇంత రెమ్యునేషన్ ఇచ్చినప్పుడు హీరో పవన్ కళ్యాణ్ కి ఇంత కన్నా ఎక్కువ రెమ్యునేషనే ఉంటుంది అనేది నిర్విదాంశం. అంటే హీరో,దర్శకుల రెమ్యునేషన్స్ కలిపితే పాతిక కోట్ల దాదాపు ఉన్నప్పుడు మిగతా టెక్నిషియన్స్ ఎంతంత ఇచ్చి ఉంటారు...సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది. అసలు సినిమా నిర్మాణానానికి మిగిలేదెంత అనేది అందరికి ఆశ్చర్యకరమైన విషయమే.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేయన్నారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన క్రేజీ కాంబినేషన్ పవన్‌కళ్యాణ్, పూరిజగన్నాధ్‌లది. నాటి 'బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్ అని ఎదురుచూసిన అభిమానులకు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ .
సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పెై నిర్మిస్తున్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ పాట చిత్రీకరణతో మొత్తం పూర్తవుతుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు.
ప్రకాష్‌రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











