»   » డ్రగ్ కేసు నుంచి బడా నిర్మాతను ప్రముఖ హీరో తప్పించారా? హీరోయిన్ల నివాసాల్లోనే..

డ్రగ్ కేసు నుంచి బడా నిర్మాతను ప్రముఖ హీరో తప్పించారా? హీరోయిన్ల నివాసాల్లోనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ మహానగరం ఇప్పుడు డ్రగ్ మాఫియా వార్తలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ మీడియాలో డ్రగ్ కేసుకు సంబంధించిన కథనాలు సెన్సేషనల్‌గా మారాయి. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ పట్టుబడటంతో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఎక్సైజ్ అండ్ నార్కొటిక్ శాఖ నోటీసులు ఇచ్చిన జాబితాలో పలువురు సినీ హీరోలు ఉన్నారు. నోటీసుల జారీ కావడానికి ముందు వినిపించిన పేర్లలో కొన్ని కనిపించకపోవడంతో అనేక అనుమానాలు, దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రగ్ కేసులో బడా నిర్మాత అంటూ..

డ్రగ్ కేసులో బడా నిర్మాత అంటూ..

డ్రగ్స్ కేసు దర్యాప్తు జోరందుకోవడంతో తెరపైకి వచ్చిన పేర్లలో సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతల పేర్లు రావడం సంచలనం రేపింది. సినీ కార్యక్రమాలలో హీరోలను ఆకాశానికి ఎత్తే ఓ బడా నిర్మాత ఉన్నాడనే వార్తలు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే నోటీసులు అందజేసిన తర్వాత ఆయన పేరులేకపోవడం ఆశ్చర్యానికి లోనయ్యారు.

Daggubati Sureshbabu Reacted On Tollywood Drug Issue
ప్రముఖ హీరో తప్పించారంటూ ప్రచారం

ప్రముఖ హీరో తప్పించారంటూ ప్రచారం

డ్రగ్స్ కేసులో తొలుత బడా నిర్మాత ఉన్నారనే వార్తలు వెబ్‌సైట్లలో జోరుగా షికారు చేశాయి. కానీ ఆ తర్వాత ఆయన పేరు లేకపోవడం వెనుక ప్రముఖ హీరో జోక్యమే కారణమని ఫిలింనగర్‌లో పలువురు చెప్పుకొంటున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయంతో ఆ బడా నిర్మాత పేరును నోటీసులు జారీ చేసే జాబితా నుంచి తప్పించి ఉంటారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రముఖ హీరో మద్యానికి వ్యతిరేకం

ఆ ప్రముఖ హీరో మద్యానికి వ్యతిరేకం

కాగా నిజాయితీ, నిబద్ధతకు ప్రతిరూపంగా ఉండే ఆ హీరో ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చరనే మరో వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. గతంలో మద్యం ఉత్పత్తుల ప్రకటనలో కనిపించడానికి నిరాకరించిన సదరు హీరో డ్రగ్స్ లాంటి వాటికి మద్దతు తెలిపే అవకాశమే లేదంటున్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగానే ఆయన స్పందిస్తారని, బడా నిర్మాత డ్రగ్ కేసులో ఉంటే తాను జోక్యం కలిగించుకోరని పలువురు కొన్ని విమర్శలను ఖండిస్తున్నారు.

జాబితా నుంచి పెద్దల పేర్లు మాయం?

జాబితా నుంచి పెద్దల పేర్లు మాయం?

కాగా డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చిన పేర్లలో కొందరు ప్రముఖుల పేర్లు మాయమయ్యాయని, చిన్న చిన్న నటులను ఇందులో ఇరికించి కేసును బలహీన పరిచే కార్యక్రమం మొదలైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అయ్యే పిల్లలు, వారికి సంబంధించిన వారి పేర్లను పలుకుబడి ఉపయోగించి తీసి వేసి ఉంటారనే వాదనను సామాన్య జనం చెప్పుకోవడం గమనార్హం.

19 నుంచి విచారణ వేగవంతం..

19 నుంచి విచారణ వేగవంతం..

ఇప్పటికే తొలి జాబితాలోని హీరోలకు నోటీసులు జారీ చేసి 19వ తేదీ నుంచి విచారణ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హీరోలను ఎక్సైజ్, నార్కొటిక్ ఆఫీసుల్లో విచారించాలని, హీరోయిన్లను తమ తమ నివాసాల్లోనే అధికారులు విచారిస్తారనే మాట వినిపిస్తున్నది. అయితే రెండో జాబితాలో మరికొందరి సినీ హీరోల పేర్లు వెల్లడించడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

English summary
Telangana Prohibition and Excise Department issued notices to some Tollywood personalities.There some allegations that few of influential actors are escaped from the list.Famous producer name not in the list. In this juncture, some people doubt about the producer's escape. People feels that a top hero intervention may happened this case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu