»   » ఫస్ట్ కాపీ చూసారు: అంత 'దృశ్యం' ఉన్నదా?

ఫస్ట్ కాపీ చూసారు: అంత 'దృశ్యం' ఉన్నదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా 'దృశ్యం'. ఈ చిత్రం ఫస్ట్ కాపీని రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్ లో యూనిట్ సభ్యులతో పాటు, వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, దర్శకురాలు చూసారని సమాచారం. ఒరిజనల్ చూసిన వారికి ఈ చిత్రం పెద్దగా ఆనకపోయినా, తెలుగులో మాత్రమే చూసేవారికి చిత్రం ఆకట్టుకుంటుందని తేల్చారని సమాచారం. దర్శకురాలు శ్రీప్రియ తన దర్శకత్వ ప్రతిభ ని కేవలం అక్కడ సీన్స్ ని ఇక్కడ అనువదించటానికి మాత్రమే ఉపయోగించని టాక్. వెంకటేష్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా చేసాడని, అతనికో ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుందని అంటున్నారు.

How is venkatesh Drishyam first copy

మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పిస్తున్నారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తారు.

"ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. వచ్చేనెల్లో విడుదల చేస్తాం'' అని నిర్మాతలు డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి తెలిపారు. నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

English summary

 Venkatesh ‘Drishyam’ movie’s first copy is ready and the unit including Venkatesh watched it in Prasad labs. Drishyam will go for censor shortly and the movie is likely to release on July 5th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu