AA22 Budget: అల్లు అర్జున్, అట్లీ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? రికార్డు స్థాయి పారితోషికాలతో సన్ పిక్చర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. అయితే పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ నటించే సినిమా ఏమిటనే ప్రశ్న కొద్దికాలంగా సినీ వర్గాల్లోను, అభిమానుల్లోను తలెత్తింది. కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కాస్త ఓపిక పట్టండి. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని చెప్పుకొంటూ వచ్చారు. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన తదుపరి సినిమాకు సంబంధించి విషయాలను వెల్లడించి షాక్ గురి చేశారు. అయితే ఐకాన్ స్టార్ కెరీర్‌లో ఆయన నటించే 22వ సినిమా వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని, లేదా అట్లీతో ఓ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి తెరపైకి వస్తుందనే చర్చ భారీగా జరిగింది. అయితే త్రివిక్రమ్ సినిమాకు కొంత సమయం పడుతుందనే విషయాన్ని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో అట్లీతో సినిమా ఖాయమని తేల్చేశారు.

AA22 Budget

అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకొని అట్లీ, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కాబోతున్నది. ఈ సినిమాకు ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు చదివిన తర్వాత బుర్ర తిరిగిందని చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

AA22 X A6 వర్కింగ్ టైటిల్‌తో సినిమా పీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా ప్రారంభించారు. గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ మూవీ కోసం స్పైడర్ మ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెజ్, ఐరన్ మ్యాన్ VFX సూపర్‌వైజర్ జేమ్స్ మడిగన్, ఆర్టిస్టిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు నామినీ మైక్ ఎలిజల్డీ, అక్వామెన్ మూవీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జస్టిన్ తదితరులు పనిచేస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలబోతున్నదని చిత్ర యూనిట్ వెల్లడిస్తున్నది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్, అట్లీ రెమ్యునరేషన్లు మినహాయించి సుమారుగా 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు మీడియాలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

AA22 Budget

ఇక A22 మూవీ కోసం అల్లు అర్జున్ కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకొనే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సుమారుగా 250 కోట్ల మేర పారితోషికాన్ని తీసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అట్లీ సుమారుగా 100 కోట్లకుపైబడి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లకుపైగానే ఉంటుందనే ప్రచారం తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: aa22 allu arjun atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X