twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శెలవులు వచ్చినా...లాసే...ఎంత?

    By Srikanya
    |

    హైదరాబాద్ : అక్టోబర్ 1న విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం మార్నింగ్ షోకే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. మెగాభిమానులు సైతం ఈ చిత్రం హిట్టా...ఫ్లాఫ్ అన్న విషయం తేల్చుకోలేనంత సందిగ్దంలో పడేసింది. మరో ప్రక్కన నిర్మాత బండ్ల గణేష్ మాత్రం అటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దంటూ నలభై కోట్ల మార్కు దాటేసిందని చెప్పారు. అయితే ట్రేడ్ వర్గాల్లో చెప్పుకునేదాన్ని బట్టి ఈ చిత్రం ఇరవై నుంచి ముఫ్పై శాతం దాకా లాస్ తెచ్చి పెట్టిందని చెప్పుకుంటున్నారు. దానికి తోడు ప్రమేషన్ ఆపు చేయటం, తుఫాన్ ఎఫెక్టు కూడా సినిమాని కలెక్షన్ వైజ్ గా దెబ్బ తీసాయంటున్నారు. ఎంటర్టైన్మెంట్ పెంచి, పాటలు బాగుండి ఉంటే ఖచ్చితంగా లాభాలు వచ్చేవని చెప్తున్నారు. మొదట్లో శెలవలు వచ్చినా తర్వాత ఫలితం లేకుండా పోయిందంటున్నారు.

    చిత్రం కథలో ...లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. విడిపోయిన తన కుటుంబాన్ని కలుపుతాడు. తన తాతని, తండ్రిని, బాబాయిని ఏకం చేస్తాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం.

    How Much Distributors lost with GAV?

    ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషించారు. అయితే కామెడీ పెద్దగా లేకపోవటం, ఆడియో కూడా పెద్ద ఆదరణ పొందకపోవటం ఈ చిత్రం విజయానికి ప్రధాన అడ్డంకిగా మారాయి.

    ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    Ram Charan starrer Govindudu Andarivadele going by the sources distributors of the film have incurred losses of 20 to 30 percent of their investment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X