రామ్ చరణ్ తేజ కి ఆ రూల్స్ వర్తించవా?
కాస్ట్ కటింగ్ విషయమై పరిశ్రమలో విస్తృత స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నిర్మాతల మండలి..విషయం తేలేవరకూ పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించకూడదని రూల్ పెట్టింది. అయితే రామ్ చరణ్ తేజ నూతన చిత్రం ఓపెనింగ్ కి ఆ రూల్స్ అడ్డం రావటం లేదని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోస్ లో రేపు ఈ చిత్రం ఓపెనింగ్ జరగనుంది. పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించిన తమిళ దర్శకుడు ధరణి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం కోసం పూజ కార్యక్రమాలు రేపు జరగనున్నాయి. ఇక రామ్ చరణ్ తేజ రెండు రోజుల క్రిందట వరకూ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరెంజ్ చిత్రం షూటింగ్ లో పాల్గొని సిటీలోకి వచ్చారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది.
జెనీలియా రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ బొమ్మరిల్లు భాస్కర్ మగధీర కాజల్ రాజమౌళి rajamouli orange magadheera ram charan teja genelia


Click it and Unblock the Notifications