వారణాసిలో శివుడిగా స్టార్ హీరో.. రాజమౌళి ప్లానింగ్ మాములుగా లేదుగా..

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రాజెక్ట్‌లలో వారణాసి ఒక్కటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ మూవీ ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో హైప్ సృష్టించింది. బాహుబలి, RRR తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ విషయమేంటీ?

భారీ అంచనాలు నెలకొన్న వారణాసి మూవీపై రోజురోజుకో అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన సెట్స్, మినీచర్స్, కాన్సెప్ట్ విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారణాసి నగరాన్ని హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రీక్రియేట్ చేయడం ఈ ప్రాజెక్ట్ గ్రాండియర్‌ను స్పష్టంగా చూపుతోంది. కాశీ నగరంలోని ఇరుకైన వీధులు, ఘాట్లు, ఆలయాలు అన్నీ రియలిస్టిక్‌గా రూపొందించారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ VFX కంపెనీలు పని చేస్తున్నాయి. దాదాపు రూ.1300కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా, ఇండియన్ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారనున్నది.

Hrithik Roshan as Shiva in Rajamouli s Varanasi Viral Buzz Around Mahesh s Epic Film

కథ పరంగా 'వారణాసి' మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ వంటి విభిన్న జోనర్స్‌ను కలిపి రాజమౌళి తనదైన శైలిలో ఈ కథను రూపొందిస్తున్నారు. సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథ త్రేతాయుగం నుంచి 2027 వరకు టైమ్ లైన్ స్టోరీగా సాగనున్నది. వివిధ కాలాల్లో వారణాసి ఎలా మారిందో చూపించనుంది. ఆస్టరాయిడ్ బెదిరింపు, పురాణ అంశాలు, ఆధునిక విజ్ఞానం అన్నీ కలిసిన సినిమాగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రపై ఇప్పటికే అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆయన 'రుద్రుడు' లేదా శ్రీరాముడి తత్వాన్ని ప్రతిబింబించే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించినట్లు టాక్. బుల్‌పై స్వారీ చేస్తూ, త్రిశూలం పట్టుకున్న లుక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచింది. ఇది మహేష్ కెరీర్‌లోనే డిఫరెంట్, గ్రాండియోస్ పాత్రగా నిలవనుంది. ఇక హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తుండగా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

అలాగే.. ఈ సినిమా ఒకే భాగంలో విడుదల అవుతుందా? లేక రెండు పార్టులుగా వస్తుందా? అన్న చర్చ. మొదట ఈ సింగిల్ పార్ట్‌గా ప్లాన్ చేసినప్పటికీ, కథ నిడివి దృష్ట్యా రెండు భాగాలుగా తీసే ఆలోచన కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. 'బాహుబలి' తరహాలో ఒక సస్పెన్స్ ఎండింగ్‌తో మొదటి ప్రదర్శన ముగిస్తే, రెండో భాగంపై భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి విదేశీ లొకేషన్లలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన కాశీ సెట్స్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొత్తం షూటింగ్ దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతుండగా, ఇంకా కొన్ని నెలల షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం.

ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో అంశం.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో లార్డ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్త. ఈ వార్త ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ పాత్ర కీలకం అని టాక్ వస్తుంది. అయితే.. ఈ అంశంపై అధికారికంగా ఇలాంటి ప్రకటన లేదు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న ఉగాది లేదా శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X