‘పుష్ప’ నిర్మాతలకు హృతిక్ రోషన్ ఝలక్.. వామ్మో దిమ్మతిగిరిపోయిందిగా
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు షాకింగ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు వారి పారితోషికాల శాతం పెరుగుతూనే వస్తోంది. మరోవైపు వారి సినిమాల బడ్జెట్స్ కూడా భారీ స్థాయిలో ఉంటుండటం ఆశ్చర్యకరంగా మారుతోంది. అయితే హీరోలు షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో సినిమాలకు భారీ బడ్జెట్ ను వెచ్చించడం నిర్మాతలకు కూడా కత్తి మీద సాములా మారింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'క్రిష్', 'ధూమ్ 2' వంటి చిత్రాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హృతిక్ రోషన్ ఇప్పటి వరకు ఇతర భాషల చిత్రాల్లో నటించలేదు. ఇక తొలిసారిగా తెలుగు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీపై తాజాగా మరో షాకింగ్ వార్త వైరల్ గా మారింది.

హృతిక్ రోషన్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ లో నటించేందుకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారంట. అందుకు సంబంధించిన మేటర్ ఇప్పుడు బయటికి వచ్చింది. హృతిక్ రోషన్ తో 'పుష్ప' వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ఇందుకు హృతిక్ రోషన్ ను సంప్రదించగా.. ఆయన షాకింగ్ గా రిప్లై ఇచ్చారంట. తెలుగులో సినిమా చేయాలంటే ఏకంగా రూ.300 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారంట.
ఇక వార్ 2 చిత్రానికి కేవలం రూ.82 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్న హృతిక్ రోషన్.. తెలుగు సినిమాకు రూ.300 కోట్లు డిమాండ్ చేయడంతో దిమ్మతిరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి అంటున్నారు. ఇక హృతిక్ రోషన్ తో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బాబీ కొల్లి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించగా హృతిక్ రోషన్ కు కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇక బడ్జెట్, రెమ్యునరేషన్ల సంగతి తేలితే తదుపరి అప్డేట్స్ రానున్నాయని అంటున్నారు.
ఇప్పటికే బాబీ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్లో హృతిక్ రోషన్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెగటివ్ పాత్రలో అలరించబోతున్నారని తెలుస్తోంది. నెక్ట్స్ హృతిక్ రోషన్ 'క్రిష్ 4'లోనూ నటించబోతున్నారు. పైగా తానే దర్శకత్వం వహించబోతుండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











