సౌత్ ఇండస్ట్రీలో హృతిక్ ఎంట్రీ.. మల్టీ స్టారర్ సినిమాలో టాప్ హీరోతో..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వార్ చిత్రంతో ట్రైగర్ ష్రాఫ్ తో కలిసి నటించి అలరించారు. ఇక నెక్ట్స్ ఆ యాక్షన్ చిత్రానికి సీక్వెల్ గా రూపుదిద్దుకున్న వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది కూడా మల్టీ స్టారర్ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే మున్ముందు సౌత్ ఫిల్మ్స్ లోకి బాలీవుడ్ గ్రీక్ గార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దక్షిణాదిలో భారీ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వార్ 2 చిత్రంపై భారీ హైప్..
ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మరింత హైప్ ను పెంచుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీ హైప్ ను తెచ్చిపెట్టింది. మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కూడా మున్ముందు ప్రమోషన్స్ తో అదరగొట్టబోతున్నారు. దీంతో సినిమాకు ఊహించనంత హైప్ అందనుంది.

హృతిక్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్..
వార్ 2 చిత్రం విడుదల కానున్న సమయంలో హృతిక్ రోషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. హృతిక్ రోషన్ డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటించే అవకాశం ఉందని ఆ మధ్య సినీ వర్గాల్లో చర్చ సాగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హృతిక్ రోషన్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశారంట. కానీ హృతిక్ రోషన్ 300 కోట్లకు పైగా పారితోషికం ఆశించడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది.
కన్నడ స్టార్ తో హృతిక్..
తాజాగా హృతిక్ రోషన్ సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మళ్లీ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు ఊపందుకున్నాయి. అయితే అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల్లోనే ఉంది. ఇక హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించబోతుందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మున్ముందు ఎలాంటి సమాచారం అందుతుందో చూడాలి.
వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్..
హృతిక్ రోషన్ అభిమానులు ప్రస్తుతం వార్ 2 వైబ్ లో ఉన్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ఎప్పుడూ థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు మేకర్స్ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ద్వారా విడుదల చేశారు. 100 కోట్ల రూపాయలు పెట్టి థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేవలం తెలుగు వెర్షన్ లోనే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











