విడిపోయిన భార్యతోనే మళ్లీ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో?
Recommended Video

హృతిక్ కోషన్-సుసానె ఖాన్ దంపతులు విడిపోతారు అని ఎవరూ ఊహించలేదు. వారి ప్రేమ బంధం బయటి ప్రపంచానికి అంత బలంగా కనిపించింది. 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ 2013లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అయితే ఆ షాక్ నుండి అభిమానులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇంతలోనే వీరు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సారి వారు ఇవ్వబోయే షాక్ అభిమానులను ఆనందానికి గురి చేయడం ఖాయం.

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?
విడిపోయిన తర్వాత కొంతకాలంగా దూరంగా ఉన్న హృతిక్ కోషన్-సుసానె ఖాన్ దంపతులు క్రమక్రమంగా మళ్లీ దగ్గరయ్యారు. ఎంతలా అంటే ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్లడాలు, కలిసి పార్టీలు చేసుకునేంతలా. త్వరలో ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ దూరం ఇద్దరినీ దగ్గర చేసింది
ఏవో కొన్ని మనస్పర్థలతో విడిపోయిన ఇద్దరూ..... ఒకరికొకరు దూరం అయిన తర్వాత ఒకరి విలువ మరొకరు తెలుసుకున్నారు. ఆ దూరం ఇద్దరి మళ్లీ దగ్గర చేసింది. విడాకులను తమ జీవితంలో ఓ చీకటి అధ్యాయంగా భావించి మళ్లీ కలిసి జీవితాంతం ఉండాలని డిసైడ్ అయ్యారట.

ఆ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం
ఇటీవల హృతిక్ తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి సుసానె ఖాన్ హాజరవ్వడంతో పాటు ‘ఎప్పటికీ నా జీవితంలో నువ్వే సన్‌షైన్. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి' అంటూ ట్విట్టర్‌లో విష్ చేసింది. హృతిక్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ వీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.

గతంలో వార్తలను ఖండించిన సుసానె
గతంలోనూ ఇద్దరూ మళ్లీ కలిసిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు సుసానె ఆ వార్తలను ఖండించింది. అలాంటి అవకాశమే లేదు. అయితే మేము మా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నాం. పిల్లల కోసమే కలుస్తున్నామని ట్వీట్ చేసింది.

నిజంగానే కలుస్తారా?
అయితే హృతిక్-సుసానె మళ్లీ కలిసిపోయి..... పెళ్లి చేసుకుంటారో? లేదో? తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











