»   » తెలుసా :'బాహుబలి' కి మొదట అనుకున్నది ఈ ఇద్దరి హీరోలనూ

తెలుసా :'బాహుబలి' కి మొదట అనుకున్నది ఈ ఇద్దరి హీరోలనూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి చిత్రమైన విశేషాలు బయిటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా...ఈ చిత్రం హిందీ వెర్షన్ ని హిందీ హీరోలతో రాజమౌళి ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఆ హీరోలు మరెవరో కాదు...

రానా పాత్రకు...జాన్ అబ్రహం, ప్రభాస్ పాత్రకు గానూ హృతిక్ రోషన్. వీరిద్దరితో హిందీలోనూ అదే సమయంలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు. అందునిమిత్తం వీరిద్దరికీ స్క్రిప్టు లు సైతం పంపారు. కానీ వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో వీరి నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో రాజమౌళి విరమించుకున్నట్లు సమాచారం. అందుచేతే హిందీలోనూ తెలుగు వెర్షన్ ని డబ్బింగ్ చేసి వదిలారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.


 Hrithik Roshan and John Were Approached for 'Bahubali'

కలెక్షన్స్ విషయానికి వస్తే...


తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.


ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.

English summary
Hrithik Roshan and John Abraham were being considered for Prabhas and Rana Dagggubati's roles initially for Hindi version of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu