హృతిక్ రోషన్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. దర్శకుడు ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గార్డ్, యాక్షన్ అండ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ త్వరలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్ట్ ఫిలిం చేయబోతున్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో ఊపు అందుకుంది. చివరిగా హృతిక్ రోషన్ బాలీవుడ్లో ఫైటర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫిమేల్ లీడ్ లో నటించింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో హృతిక్ రోషన్ తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహించారు.
ప్రస్తుతం బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. 2019లో వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ పాత్రలో అలరించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్ కూడా తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. దీంతో వారి రాబోయే చిత్రాలపై ఫోకస్ చేశారు.

ఇక హృతిక్ రోషన్ రీసెంట్ గానే తను మొదటిసారిగా దర్శకత్వం వహించబోతున్నారని అధికారికంగా ప్రకటన ఇచ్చారు. క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషన్ డైరెక్టర్ కావడం ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే హృతిక్ రోషన్ త్వరలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ తెలుగు ఫిలిం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
హృతిక్ రోషన్ ను డైరెక్ట్ చేయబోతున్న ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరో కాదు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి కావడం విశేషం. బాబి రీసెంట్ గా నే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక బాబీ తన నెక్స్ట్ ఫిలింలో హృతిక్ రోషన్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అందుకోసం కథ కూడా సిద్ధం చేశారంట.
ఇక రీసెంట్ డేస్ లో దర్శకుడు బాబి హృతిక్ రోషన్ ను కలిసి స్టోరీ లైన్ ను కూడా చెప్పారంట. ఆ కథ హృతిక్ రోషన్ కు ఎంతగానో నచ్చిందట. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ అఫీషియల్ గా ఫిక్స్ కానుందని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో బిగ్గెస్ట్ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, బాబీ డియోల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు ఆయా చిత్రాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నడంతో బాలీవుడ్ స్టార్ ఇటువైపు మల్లుతున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











