హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ మూవీ? కేజీఎఫ్ నిర్మాత మాస్టర్ ప్లాన్ ఇదేనా?

హృతిక్ రోషన్.. బాలీవుడ్ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన 50 ఏళ్లకు పైబడిన కుర్ర హీరోలతో పోటీగా బాడీ బిల్డ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు హృతిక్. తన సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్ చేస్తుంటారు. ఈ ఏజ్ లో కూడా దిమ్మతిరిగిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నారు హృతిక్. ఈ స్టార్ హీరోతో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారట. ఆ మూవీని కేజీఎఫ్, సలార్, కాంతార వంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కించబోతున్నరట. ఇంతకీ ఆ డెరెక్టర్ ఎవరు?

ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. టాలీవుడ్‌లో 'గీత గోవిందం'తో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్. 2008లో 'యువత' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్.. 'ఆంజనేయులు', 'సోలో', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిన సినిమా మాత్రం 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, డైరెక్టర్ పరశురామ్ ను టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో చేరేలా చేసింది.

Hrithik Roshan to Team Up With Tollywood Director Parasuram

ఆ విజయంతో ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారని అంతా భావించారు. అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' చేసే అవకాశం కూడా దక్కింది. కమర్షియల్‌గా ఆ సినిమా మంచి వసూళ్లు సాధించినప్పటికీ, కథ, కథనంపై విమర్శలు రావడంతో ఆశించిన స్థాయిలో ప్రశంసలు దక్కలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ స్టార్' కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో పరశురామ్ గత రెండేళ్లుగా కొత్త సినిమా ప్రకటించకుండా.. కొత్త కథపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ సారి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన హోంబలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పరశురామ్ ఇటీవల హృతిక్ రోషన్‌కు ఒక యాక్షన్-ఎమోషనల్ డ్రామా కథను వినిపించారట. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కథగా దీనిని రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. హృతిక్‌కు కూడా ఈ కథ లైన్ నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్లుగా వివిధ భాషల్లో పాన్ ఇండియా సినిమాలను రూపొందించే వ్యూహంతో ముందుకెళ్తుంది హోంబలే. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్యతో కూడా ఒక భారీ సినిమాను ప్రకటించింది. గతంలో హృతిక్ రోషన్‌తో సినిమా చేయనున్నట్లు కూడా సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే ఆ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పరశురామ్ పేరు బలంగా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ నిజమైతే, పరశురామ్ కెరీర్‌లో ఇదే అత్యంత భారీ సినిమా అవుతుంది. ఇప్పటివరకు ఆయన ప్రధానంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు తెరకెక్కించారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు హృతిక్ రోషన్, పరశురామ్ లేదా హోంబలే ఫిలిమ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X