హృతిక్-సుజానె విడాకుల నిర్ణయం వెనక కారణాలు?
హైదరాబాద్: 17 ఏళ్ల ప్రేమ బంధం, 13 ఏళ్ల వివాహం బంధం......తెగిపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సుజానె విడిపోతున్నారు. తన భార్య తన నుండి డిపోవాలని కోరుకుంటోందని, తమ బంధం తెగిపోతోందని మీడియాకు వెల్లడించారు హృతిక్.
అయితే వీరు విడిపోవడానికి కారణాలు అనేకం వినిపిస్తున్నాయి. కైట్స్ సినిమా సమయంలోనే అందులో నటించిన బార్బరా మోరీతో హృతిక్ సన్నిహితంగా మెలగడం సుజానెకు నచ్చలేదని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఆతర్వాత ఇద్దరు సజావుగానే కాపురం సాగించారు.
ఈ మధ్య అత్త మామలతో సుజానెకు అస్సలు పడటం లేదని, వేరు కాపురం పెడదామంటే హృతిక్ పట్టించుకోవడం లేదని, భర్త కూడా తనకు సపోర్టుగా నిలవక పోవడాన్ని సుజానె జీర్ణించుకోలేక పోయిందని వార్తలు వెలువడ్డాయి. ఈ కారణంగనే హృతిక్‌తో విడిపోవాలని సుజానె నిర్ణయించుకుందనే వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఇపుడు ఆ వార్తలు నిజం అయ్యాయి.
చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. ఇప్పుడు సుజానె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారట.


Click it and Unblock the Notifications












