ప్రభాస్, రాజమౌళిల 100కోట్ల బడ్జెట్ సినిమా ఎప్పుడంటే...?
ప్రభాస్ సినిమాకి రాజమౌళి కథ ఎవరిది అనే ప్రశ్న ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మామూలుగా రాజమౌళి అన్ని సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథనందించటం పరిపాటి. కానీ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అండ్ కో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ జానపద చిత్రానికి ఒక విద్యార్థి రాసిన కథని, ఆ విద్యార్థికి అరవై లక్షల రూపాయలనిచ్చి రాజమౌళి ఆ కథను కొనుగోలు చేశారనీ, ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.
కాగా ప్రభాస్..రాజమౌళిల కాంబినేషన్లో రూపొందే ఈ సినిమా నవంబర్లో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. 'ఛత్రపతి' సినిమా తరువాత ప్రభాస్..రాజమౌళిల కలయికలో వస్తున్న ఈ మూవీకి బడ్జెట్ ఎంత అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఇటీవల భారీ బడ్జెట్తో నిర్మించిన ఖలేజా, పులి, ఆరెంజ్, అనగనగా ఓ థీరుడు, శక్తి ... చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. పైగా, ఈ చిత్రానికి రాజమౌళి ఎంచుకున్న జానపద కథకు బడ్జెట్ దాదాపు వంద కోట్లుపైనే అవుతుందట. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్ చిత్రాలు పరాజయం సాధిస్తుండడంతో బడ్జెట్ విషయంలో తటపటాయిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ని ఎలా తగ్గించాలనే విషయం గురించి ప్రస్తుతం తీవ్రంగా ఆలోచిస్తున్నారట. రాజమౌళి, ప్రభాస్ చిత్రం రానున్న నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నిర్మిస్తున్న "ఈగ" సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే..


Click it and Unblock the Notifications











