NBK108: బాలయ్య - అనిల్ సినిమాకు కళ్లు చెదిరే బడ్జెట్.. ఏకంగా అన్ని కోట్లతో రికార్డు

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన కొత్తలోనే భారీ సక్సెస్‌లను సొంతం చేసుకున్న ఆయన.. స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నారు. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన బాలయ్య.. ఇటీవలే మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. దీంతో ఉత్సాహంగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడితో ఆయన చేసే సినిమా బడ్జెట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

అఖండతో మరోసారి హిట్ ట్రాక్

అఖండతో మరోసారి హిట్ ట్రాక్

నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

గోపీచంద్‌తో మాస్ మూవీకి రెడీ

గోపీచంద్‌తో మాస్ మూవీకి రెడీ

'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

అనిల్ రావిపూడితోనూ సినిమా

అనిల్ రావిపూడితోనూ సినిమా

నటసింహా నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

బాలయ్య కూతురిగా హీరోయిన్

బాలయ్య కూతురిగా హీరోయిన్

క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త పంథాలో తెరకెక్కించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. మరికొంత మంది ప్రముఖులు నటిస్తున్నారని టాక్.

అలాంటి కథ.. సరికొత్త టైటిల్

అలాంటి కథ.. సరికొత్త టైటిల్

నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వినూత్నంగా 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం.

బాలయ్య మూవీకి భారీ బడ్జెట్

బాలయ్య మూవీకి భారీ బడ్జెట్

ఇద్దరు పేరున్న స్టార్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బడ్జెట్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఏకంగా రూ. 80 కోట్లు బడ్జెట్ కేటాయించారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో బాగా వైరల్ అవుతోంది.

బాలకృష్ణ కెరీర్‌లోనే రికార్డు

బాలకృష్ణ కెరీర్‌లోనే రికార్డు

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాకు ఏకంగా రూ. 80 కోట్లు బడ్జెట్ కేటాయించారన్న వార్త ఫిలిం సర్కిళ్లలో చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం బాలయ్య కెరీర్‌లో ఇంత మొత్తం బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా ఆయన కెరీర్‌లో బిగ్ మూవీగా రికార్డు కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X