అరాచకం.. ప్రభాస్ కోసం రాజమౌళి కంటే మొండిగా ఖర్చు చేస్తున్నారు.. అందుకోసం 250కోట్లా?
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన రెబల్ స్టార్ రానున్న రోజుల్లో అంతకు మించి అనేలా రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ రాజమౌళి కంటే కూడా కొంతమంది అగ్ర దర్శకులు ప్రభాస్ పై భారీగా పెట్టుబడి పెట్టేస్తున్నారు. అందులో ఆదిపురుష్ దర్శకుడు ఓం రావత్ ఒకరు.

సరికొత్త విజువల్స్ తో
రామాయణం కథను ప్రస్తుత జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా తియ్యడం అనే ఆలోచన చాలా రిస్క్ తో కూడుకున్నది. దర్శకుడు ఓం రావత్ ప్రభాస్ ను ఒప్పించాడు అంటే సినిమా ప్లానింగ్ చాలా కొత్తగా ఉండవచ్చని చెప్పవచ్చు. చరిత్రను మార్చకుండా సరికొత్త విజువల్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నారట.

స్టార్ క్యాస్ట్ తోనే అంచనాలు పెంచేశారు
ప్రభాస్ ఒప్పుకున్నప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించడానికి ఒప్పుకోగానే అంచనాల డోస్ మరింత పెరిగాయి. ఇక సీత పాత్రలో కృతి సనోన్ ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన అన్ని పాత్రలను ఫైనల్ చేసేశారు. ఇక వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

గ్రాఫిక్స్ కోసమే..
అయితే ప్రభాస్ మీద నమ్మకంతో దర్శకుడు ఓం రావత్ రాజమౌళి కంటే మొండిగా బడ్జెట్ పెట్టేస్తున్నారట. ఒక విధంగా కంటెంట్ పై ఉన్న నమ్మకం కూడా అని చెప్పవచ్చు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకమైనవి. దాదాపు షూటింగ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఉపయోగించే షూట్ చేస్తున్నారు. సెట్స్ వేయకుండా మొత్తం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు.
బికినీలో అందాల ఆరబోత.. జారా ఎస్మిన్ రచ్చ

దానికోసమే 250కోట్లా?
కేవలం నటినటులు టెక్నీషియన్ల రెమ్యునరేషన్ తప్పితే దాదాపు మొత్తం బడ్జెట్ VFX వర్క్ కోసమే ఉపయోగించనున్నారట. కేవలం గ్రాఫిక్స్ కోసమే 250కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట. మొత్తం 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు మొదట్లో వివరణ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు 500కోట్లను టచ్ చేసేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. అంటే ఇండియన్ సినిమా హిస్టారిలో గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువ బడ్జెట్ పెడుతున్న మొదటి సినిమా నిర్మాతలు వీళ్లే. మరి సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











