అల్లు అర్జున్‌లో ఎంత మార్పు .. షాకవుతున్న ఫ్యాన్స్ , కారణం ఏంటీ?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హీట్ టాపిక్‌గా వినిపిస్తున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరే ఎక్కువగా ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమాతో అనే కాకుండా ఆ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన రచ్చతోనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సెన్సేషన్‌కు కారణమయ్యాడు.
సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కానీ పలు వీడియోస్ లో తాను ధరించిన వేషధారణపై కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో గొడ్డలి ఉన్న హూడి వేసుకోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి.

ఇదే కాకుండా తాను జైలు నుంచి వచ్చాక కూడా ఐకాన్ స్టార్ అనే టి షర్ట్ వేసుకొని కనిపించడంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా పక్కన పెడితే దీనిపై కూడా చాలా మంది బన్నీకి సపోర్ట్ గా మాట్లాడారు. అయితే లేటెస్ట్ గా మాత్రం అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన నాటిన నుంచి ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
కాగా రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినపుడు అల్లు అర్జున్ ఎలాంటి బ్రాండింగ్ లు గాని, ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా ప్లైన్ టి షర్ట్స్‌లోనే కనిపించడం టాపిక్ గా మారింది. ఇక ఇది కాకుండా సోషల్ మీడియాలో తన నుంచి ఏమన్నా అనౌన్సమెంట్ లు కానీ లేదా ఏవన్నా ప్రెస్ నోట్ లు అలాగే విషెస్ లాంటివి వచ్చినా తన అల్లు అర్జున్ లోగో 'AA' తప్పకుండా వేసుకునేవాడు. కానీ ఇది కూడా ఇపుడు అల్లు అర్జున్ తప్పించడంతో బన్నీలో చాలా మార్పే వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరి ఈ గ్యాప్‌లోనే తనకి అంతలా ఏమయ్యిందా అని కూడా కొందరు మాట్లాడుకుంటే కారణం ఏదైనా ఈ మార్పు మంచిదే అని ఇంకొందరు అనుకుంటున్నారు. ఇలా మొత్తంగా అల్లు అర్జున్ ఇపుడు ఏది చేసినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే మారిపోతుంది అని చెప్పాలి.
ఇక ఈ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ నటించిన భారీ సీక్వెల్ పుష్ప 2 ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ రెండో గ్రాసర్ దిశగా దూసుకెళ్తుంది. ఆల్రెడీ రూ.1700 కోట్ల మేర టార్గెట్ ని కొట్టిన పుష్ప 2 హిందీలో సంచలన వసూళ్లతో దూసుకెళ్తుంది. ఒక్క హిందీ వెర్షన్‌లోనే పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ని కొడుతోంది అనే టాక్ ఇపుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











