రాజమౌళి సామాన్యుడు కాదు..అసాధ్యుడు...!?

By Sindhu

ఒక డైరెక్టర్ కి హీరోలతో సమానంగా స్టార్ డమ్ రావడమనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం తన పేరుతోనే కోట్ల బిజినెస్ చేయగల ఏకైక తెలుగు దర్శకుడు రాజమౌళి అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమని శాసిస్తున్న ఈ దర్శకుడితో గతంలో పూరి, వివి వినాయక్ లాంటి కొందరు పోటీ పడేవారు. కానీ మగధీర తర్వాత రాజమౌళి రేంజ్ అమాంతం రెట్టింపయింది. మిగతా వారికి అందనంత ఎత్తులో అతను నిలిచాడు.

లక్షమందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ టెక్నీషియన్ అతను. ఈ అరుదైన ఘనత సాధించిన రాజమైళి సాధించాడంటే అతనికి ప్రజల్లో ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరనేది కూడా జనానికి అవసరం లేదు. పోస్టర్ పై రాజమౌళి మార్క్ కనిపించిందో ఐయస్ఐ ముద్ర చూసినట్టు సినిమా బాగుంటుందనే ఖచ్చితమైన నమ్మకంతో థియేటర్స్ కి వచ్చేస్తారు. ఆ నమ్మకం రాబట్టుకోవడం కాదు, దానిని నిలబెట్టుకోవడంలోనే రాజమౌళి గొప్పతనం కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈగ ఇప్పటివరకు క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అయితే ఈగ ను బయటకు వదలడానికి రాజమౌళి ఇంకా మేకప్ చేయాలనుకుంటున్నాడట. మేకప్ అంటే మరోలా అనుకోకండి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఈగను తీర్చి దిద్దాల్సింది చాలానే ఉందట. గ్రాఫిక్స్ తో నిండిన సినిమా అంటే షూటింగ్ లో కంటే ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకనే రాజమౌళి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినా రిలీజ్ ఎప్పుడనే దాని మీద నోరు విప్పడం లేదు.

ప్రస్తుతం మిగిలిన కొంత పార్ట్ షూటింగ్ పనులు చేస్తుండగానే ట్రైలర్స్ పనిలో ఉన్నాడు రాజమౌళి. అష్టా చెమ్మా హీరోగా, సమంతా హీరోయిన్ గా నటిస్తున్నారు. నటుడు సుదీప్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. నానికి టాలీవుడ్ లో ఉన్న మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ బడ్జెట్ తోనే సినిమా తీస్తున్నారు. అయితే రాజమౌళి బ్రాండ్ ఉండగా ఎంత పెట్టినా వెనక్కి వస్తుందనే ధైర్యంతో ఉన్నారట యూనిట్. ఈ సినిమా తెలుగులో “ఈగ"గా, తమిళ్ లో “నాన్ ఈ" గా ఒకే సారి రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X