"పుష్ప 2" మించి టికెట్ రేట్స్‌ .. బరిలో మరో పాన్ ఇండియా మూవీ? జనం ఉండాలా, పోవాలా?

సాధారణంగా కొన్నిసార్లు స్టార్స్ సినిమాలు ఆయా హీరో ఉండే స్టేట్స్ లో భారీ అంచనాలతో జనం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ కొంతమంది స్టార్స్ విషయంలో మాత్రం దేశం మొత్తం ఆ స్టార్ సినిమా కోసం ఎదురు చూస్తారు. మరి ఆ స్టార్ ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన రీసెంట్‌గా నటించిన చిత్రమే పుష్ప 2 ది రూల్.

ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా పట్ల హైప్ మాత్రం ఇపుడు ఊహించని లెవెల్లో ఉంది. ఈ సినిమాపై ఉన్న హైప్ తో ఎలాగైనా ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. దీనితోనే పుష్ప 2 పై ఉన్న హైప్‌ను చిత్ర నిర్మాతలు ఓ రేంజ్ లో కాష్ చేస్కునే పనిలో ఉన్నారు.

huge negative on pushpa 2 rude hikes in telangana

ఈ సినిమాకి ఎంత పాన్ ఇండియా క్రేజ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ స్ట్రాంగ్ జోన్ మాత్రం మన తెలుగు రాష్ట్రాలే.. తెలుగు స్టేట్స్ లోనే తన సినిమాకి ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. ఇది ఏ హీరోకి అయినా కామన్ . ఇక దీనితోనే సినిమాలకి పెరుగుతున్న బడ్జెట్‌లు, ఇతర ఖర్చులతో మన తెలుగు నిర్మాతలు నెమ్మదిగా సినిమా టికెట్ ధరలు పెంచుకోవడం స్టార్ట్ చేశారు.

పాన్ ఇండియా హిట్ చిత్రం బాహుబలి 1 నుంచి మొదలైన ఈ సంప్రదాయం ఇపుడు పుష్ప 2 కి మితి మీరింది అనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణ హైక్స్ వరకు ఓకే.. మొన్న వచ్చిన దేవర , అలాగే కల్కి 2898 ఏడీ సినిమాల వరకు అభిమానులు, సామాన్య జనం కూడా తట్టుకోగలిగారు . కానీ ఇపుడు పుష్ప 2కి ఇచ్చిన టికెట్ ధరలు చూసి అంతా షాకవుతున్నారు.

huge negative on pushpa 2 rude hikes in telangana

గరిష్టంగా పుష్ప 2 టికెట్ ధర ఏకంగా రూ. 1200 ప్లస్ ఉంది. ఇది కాకుండా మిడ్ నైట్ షోలకి ఒక ధర, కొన్ని రోజులకి మరో ధర, ఇంకొన్ని రోజులకి ఒక ధరను నిర్మాతలు నచ్చినట్టుగా తెలంగాణాలో పెట్టుకున్నారు. ఏపీలో కూడా ఈ తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ పుష్ప 2కి తెలంగాణలో పెట్టిన ఫిగర్స్ చూసి మాత్రం గట్టి విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కాకుండా కొత్త సినిమా చూద్దాం అనే సగటు టాలీవుడ్ ప్రేమికుడు కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

ఇది ఖచ్చితంగా సినీ ప్రేక్షకులని గ్రాంటెడ్ గా తీసుకొని వారిని దోచుకోవడం లాంటిదే అంటూ షాకింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 విషయంలో ఇలా విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇపుడు మరో బిగ్ బడ్జెట్ సినిమా ఇదే తరహాలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. మరి ఆ సినిమా ఏదో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ ల బిగ్గెస్ట్ చిత్రం "గేమ్ ఛేంజర్" అట. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X