ఓటీటీలో నందమూరి బాలకృష్ణ సినిమా: ‘అఖండ’కు ఊహించని ఆఫర్.. నటసింహం సంచలన నిర్ణయం

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోన్న ఆయన.. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'అఖండ' అనే మూవీలో నటిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ చిత్రానికి భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై నటసింహా సంచలన నిర్ణయం తీసుకున్నారట. వివరాల్లోకి వెళితే...

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

 ముచ్చటగా మూడోసారి కలిసిన జోడీ

ముచ్చటగా మూడోసారి కలిసిన జోడీ

'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, సామ్నా కాశీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీంతం అందిస్తున్నాడు.

 సరికొత్త ప్రయోగాలతో బాలయ్య సిద్ధం

సరికొత్త ప్రయోగాలతో బాలయ్య సిద్ధం

'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు బాలయ్య. దీంతో ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందుకోసం 'అఖండ' మూవీల ఆయన ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగులో ఎవరూ చేయని అఘోరా పాత్రను కూడా పోషిస్తున్నారు. అలాగే, కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నారని సమాచారం.

‘అఖండ' అంటూ వచ్చాడు.. రెస్పాన్స్

‘అఖండ' అంటూ వచ్చాడు.. రెస్పాన్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'అఖండ' అనే టైటిల్ పెడుతున్నట్లు ఈ ఉగాదికే వెల్లడించారు. ఇందుకోసం ఓ టీజర్‌ను కూడా విడుదల చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్‌తో వచ్చిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. తద్వారా దీని పేరిట ఎన్నో రికార్డులు బద్దలైపోతున్నాయి.

 సౌతిండియాలోనే ఏకైక హీరోగా రికార్డ్

సౌతిండియాలోనే ఏకైక హీరోగా రికార్డ్

'అఖండ' టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఇది దండయాత్ర చేస్తోంది. ఫలితంగా పది రోజుల్లో 37 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను అందుకుందీ టీజర్. సీనియర్ హీరోల జాబితాలో ఇప్పటి వరకూ ఎక్కువ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 'కబాలి' ఉండేది. ఇప్పుడు దాన్ని 'అఖండ' క్రాస్ చేసేసింది. దీంతో సౌతిండియన్ రికార్డు నమోదు అయింది.

 భారీగా బిజినెస్.. అన్నీ రైట్స్ కంప్లీట్

భారీగా బిజినెస్.. అన్నీ రైట్స్ కంప్లీట్

మొదట్లో 'అఖండ' మూవీపై పెద్దగా అంచనాలు లేకున్నా టీజర్లు విడుదలైన తర్వాత ఒక్కసారిగా బజ్ ఏర్పడింది. దీంతో దీనికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బడా సంస్థలు ఈ మూవీ అన్ని ఏరియాల హక్కులు కొనుగోలు చేశాయి. అలాగే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ, శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ తీసుకున్నాయని సమాచారం.

 ఓటీటీలో నందమూరి బాలకృష్ణ సినిమా

ఓటీటీలో నందమూరి బాలకృష్ణ సినిమా

నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ' ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రెండు రోజుల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 70 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు కూడా జరిపారని తెలిసింది.

 బాలకృష్ణ సంచలన నిర్ణయం.. అందుకే

బాలకృష్ణ సంచలన నిర్ణయం.. అందుకే

'అఖండ'కు ఓటీటీ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను నందమూరి బాలకృష్ణ తిరస్కరించారని ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన అభిమానుల కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలస్యం అయినప్పటికీ ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని.. అవసరం అయితే వచ్చే ఏడాది వరకూ వేచి చూడాలని బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X