For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vijay Devarakonda's Ligerకి కాదనలేని ఓటీటీ ఆఫర్.. డిజిటల్+ శాటిలైట్ ఎంతంటే?

  |

  నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. చివరిగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశపరిచినా ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ సినిమా చేస్తున్నాడు. లైగర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  హాట్ ఫొటోలతో కాక రేపుతున్న నాగ్ హీరోయిన్.. అందాల ఆరబోతలో తగ్గేదేలే!

  వరల్డ్ ఫేమస్ లవర్

  వరల్డ్ ఫేమస్ లవర్

  చివరగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ప్రేక్షకులలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమా అందుకో లేకపోయింది. సినిమా పరంగా బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది అనే చెప్పాలి.

  లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?

  లైగర్ మీద అంచనాలు

  లైగర్ మీద అంచనాలు

  ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టాడు. అప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఒక బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

  ఆరియానా గ్లోరీ హాట్ హాట్ ఫొటోలు: ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా.. రెచ్చిపోయిన బ్యూటీ

  షూట్ కూడా మొదలు కాక ముందే

  షూట్ కూడా మొదలు కాక ముందే

  నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముంబైలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడు షూటింగ్ ప్యాకప్ చెప్పడంతో యూనిట్ సభ్యులు అందరూ తిరిగి హైదరాబాద్ చేరారు. తర్వాత మళ్ళీ షూటింగులకు పర్మిషన్ ఇవ్వడంతో కొంత మేర షూటింగ్ కూడా జరిపారు. రెండో దశ కారణంగా మళ్లీ షూటింగులకు బ్రేక్ పడింది.

  పూజా హెగ్డే మరింత వయ్యారంగా.. వడివడిగా అడుగులేస్తూ మీడియాకి చిక్కిన బ్యూటీ

  ఏకంగా 200 కోట్ల ఆఫర్

  ఏకంగా 200 కోట్ల ఆఫర్

  అయితే ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీగా ఆఫర్ చేసినట్లు సమాచారం. సినిమాని థియేటర్లో కనుక సినిమా రిలీజ్ చేయకుండా నేరుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తే ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇస్తామని సదరు సంస్థ ఆఫర్ చేసినట్లు సమాచారం.

  నటి ప్రగతి హాట్ ఫోటో గ్యాలరీ... మీరు ఎప్పుడూ చూడని ఫోటోలు!

  డిజిటల్+ శాటిలైట్

  డిజిటల్+ శాటిలైట్

  డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడమే కాక శాటిలైట్ రైట్స్ కూడా ఆ సంస్థ కోరినట్లు చెబుతున్నారు. తెలుగు భాష మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇక తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లస్ సాటిలైట్ రైట్స్ తమకు ఇస్తే 200 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.

  Yash, Puri Jagannadh To Team Up For A Political Thriller || Filmibeat Telugu
  కానీ

  కానీ

  ఈ సినిమాని కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ అలాగే పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్ బ్యానర్స్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి థియేటర్లు మళ్లీ ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో ఈ ఆఫర్ వద్దని చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

  English summary
  As per latest reports Huge OTT deal for #VijayDeverakonda and #PuriJagannadh's #Liger Movie came in. The offer includes the Direct OTT rights and the satellite rights for Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada languages.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X