War 2: ఎన్టీఆర్ భారీ పారితోషికం.. హృతిక్ రోషన్ ను మించి.. ఎన్ని కోట్లంటే?

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి. ముఖ్యంగా వార్ 2 చిత్రంలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారనే వివరాల్లోకి వెళితే..

అత్యధిక బడ్జెట్ తో వార్ 2..
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి తొలుత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ ను వార్ 2గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. దీంతో చిత్రంలోనూ భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. అదే విధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చైందని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్యా చోప్రా రూ.400 కోట్లతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Huge Remuneration for Jr NTR his Upcoming film War 2

భారీ రెమ్యునరేషన్లు..
వార్ 2 చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలో ముఖ్యంగా భారీ కాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీంతో వీరు ఈ ప్రాజెక్ట్ కు పనిచేసేందుకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రూ.60 కోట్లు, హృతిక్ రోషన్ రూ.48 కోట్లు, కియారా అద్వానీ రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.32 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో బడ్జెట్ లో 150 కోట్ల రూపాయలు వీరి రెమ్యునరేషన్లకే ఖర్చవ్వడం గమనార్హం.

రజనీ కూలీతో క్లాష్..
ఆగస్టు 14న వార్ 2 చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలి చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. కూలికి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద వార్ 2, కూలి చిత్రాలకు భారీ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో ఏ చిత్రానికి ఎక్కువగా వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

వార్ 2 కాస్ట్ అండ్ క్రూ..
ఈ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్, కబీర్ దాలివాల్ గా హృతిక్ రోషన్, కావ్యా లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. అషుతోష్ రానా కల్నల్ గా అలరిస్తున్నారు. వార్ 2లో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. అలియా భట్ క్యామియో అప్పీయరెన్స్ తో అలరించబోతోంది. బెంజమిన్ జాస్ఫర్ సినిమాటోగ్రఫీగా, ఆర్తిఫ్ షేక్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంచిత్ బల్హరా, అంకిత్ బల్హరా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: jr ntr hrithik roshan war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X