పొలిటీషియన్ కూతురా?: ఆరోజు రాత్రి ప్రదీప్ కారులో.. ఎవరా అమ్మాయి?..

Recommended Video

ప్రదీప్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరంటే..!

డ్రంక్&డ్రైవ్ వద్దంటూ హితబోధ చేసిన యాంకర్ ప్రదీప్.. ఆర్నెళ్లు తిరిగేసరికి తానే ఆ కేసులో ఇరుక్కోవాల్సి రావడం యాదృచ్చికమే. ప్రదీప్‌పై కొంతమంది సానుభూతి చూపిస్తుండగా.. కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

ఏదేమైనా కౌన్సెలింగ్‌కు రాకుండా ప్రదీప్ తప్పించుకు తిరుగుతున్న తీరు.. సెలబ్రిటీలు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ ఓ వీడియో బైట్ ద్వారా తానెక్కడికి వెళ్లలేదని సమాచారమిచ్చాడు.

ఇదిలా ఉంటే, ఆరోజు రాత్రి ప్రదీప్ పట్టుబడ్డ సమయంలో అతని కారులో ఉన్న అమ్మాయి ఎవరన్న దానిపై మరో ఊహాగానం తెరపైకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

 మొదట శ్రీముఖిపై..:

మొదట శ్రీముఖిపై..:

డ్రంక్&డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఆరోజు రాత్రి ప్రదీప్ తో పాటు ఆ కారులో మరో అమ్మాయి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి శ్రీముఖి అంటూ ప్రచారం కూడా జరిగింది.

 ఖండించిన శ్రీముఖి..:

ఖండించిన శ్రీముఖి..:

ప్రదీప్ కారులో యాంకర్ శ్రీముఖి కూడా ఉందంటూ ప్రచారం జరగడంతో.. దీనిపై ఆమె స్పందించక తప్పలేదు. లేనిపోని దుష్ప్రచారంతో తమను బద్నాం చేయవద్దన్న రీతిలో ఆమె వ్యాఖ్యలు చేశారు. విషయంపై క్లారిటీ లేకుండా ఓ వ్యక్తిని ఇష్యూలోకి లాగడం సరికాదని చెప్పారు.

 పొలిటీషియన్ కుమార్తె?..:

పొలిటీషియన్ కుమార్తె?..:

ప్రదీప్ కారులో ఉన్నది తాను కాదని శ్రీముఖి ప్రకటించడంతో.. మరి ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఊహాగానం తెర పైకి వచ్చింది. ఆ అమ్మాయి ఓ రాజకీయ నాయకుడి కుమార్తె అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతన్నది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయ వేత్త కుమార్తె అంటూ ప్రచారం జరుగుతుండటంతో.. ఎవరా అమ్మాయి? అని అంతా ఆరా తీస్తున్నారు.

తప్పే.. ఒప్పుకుంటున్నా:

తప్పే.. ఒప్పుకుంటున్నా:

పరారీలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ ప్రదీప్.. ఓ వీడియో బైట్ ద్వారా తానెక్కడికి పారిపోలేదని అసలు విషయం చెప్పాడు. తాను చేసింది తప్పేనని.. తనలాంటి తప్పు మరెవరూ చేయవద్దని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

అర్థం చేసుకోండి..:

అర్థం చేసుకోండి..:

పోలీస్ ప్రొసీడింగ్స్ కు తాను హాజరవుతానని కూడా ప్రదీప్ చెప్పారు. గతేడాది డ్రంక్&డ్రైవ్ వద్దంటూ ప్రచారం చేసిన తానే ఇందులో ఇరుక్కోవడం దురదృష్టకరమన్నారు. తనను అర్థం చేసుకోవాలని విజ్నప్తి చేశారు.

 ఎక్కడికి పోలేదు..

ఎక్కడికి పోలేదు..

ఇక తాను పరారీలో ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ముందుగా కమిట్ అయిన షూటింగ్స్ వల్ల కౌన్సెలింగుకు హాజరుకాలేకపోయానని వివరణ ప్రదీప్ వివరణ ఇచ్చారు.

 ఈరోజు కౌన్సెలింగుకు..:

ఈరోజు కౌన్సెలింగుకు..:

ఈరోజు ప్రదీప్ కౌన్సెలింగుకు హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ప్రదీప్ కు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత కోర్టు ఎదుట హాజరపరిచే అవకాశం ఉంది. డ్రంకెన్ డ్రైవ్ కు తోడు కౌన్సెలింగ్ గైర్హాజరితో ప్రదీప్ ఎలాంటి శిక్షను ఎదుర్కొంటాడోనన్న చర్చ ప్రస్తుతం జోరందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X