'వెంకీ మామ'కు చుక్కలు చూపిస్తున్న 'కాలా' బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి సౌత్ లో కూడా బిజీ కాబోతోంది. ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజనీ కాలా చిత్రంతో హ్యూమా క్యురేషీకి సౌత్ లో మంచి గుర్తింపు లభించింది. చిత్ర రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కాలా చిత్రం వలన హ్యూమాకు మంచే జరిగింది. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా త్వరలో మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే.
జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకీ మామ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే ఖరారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హ్యూమా క్యురేషి హీరోయిన్ అయితే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఆమెని సంప్రదించగా ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపిందట. కానీ రెమ్యునరేషన్ విషయంలోనే తేడా వస్తున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో ఆమె రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిన్న సమస్య తీరిపోయి హ్యూమా క్యురేషి ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కాకుండా వరుణ్ తేజ్ తో కూడా వెంకీ మరో మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











