చిరు 150 వ సినిమా : ఊహిచని కొత్త సమస్య?
హైదరాబాద్ : చిరంజీవి 150 వ సినిమాకు క్రేజ్ ఏ రీతిలో ఉంటుందో లేదో కానీ ..మీడియాలో మాత్రం ఈ చిత్రం గురించి రోజుకో వార్తతో ఎప్పుడూ హాట్ గా ఉంటోంది. తాజాగా ఈ చిత్రం కోసం దర్శక,నిర్మాతలు ఓ పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అది మరేదో కాదు..సీనియర్ హీరోలుకు ఎదురవుతున్న సమస్య..హీరోయిన్. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే హీరోయిన్స్ కి కొదవ ఉండేది కాదు..పెద్ద క్యూ ఉండేది.
ఇప్పుడలా లేదు..పరిస్ధితి మారింది. కుర్ర హీరోయిన్స్ ని పెడదామంటే ఆయన కి పిల్లల్లా కనపడతారు. పోనీ సీనియర్ హీరోయిన్స్ ని పెట్టుకుందామంటే ముదురుల్లా కనపడతారు. దానికి తోడు త్రిష,శ్రియ, అనుష్క వంటి కాస్త పెద్ద హీరోల ప్రక్కన చేసే హీరోయిన్స్ అంతా ఆల్రెడీ చిరు తో చేసేసారు. దాంతో ఇప్పుడు ఎవరిని హీరోయిన్ గా తీసుకుందామనేది సమస్యగా మారనుందని అంటున్నారు.

సమంత, కాజల్, తమన్నా, నయనతార, శ్రియ వీరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాసం ఉందని అంటున్నారు. అయితే కుర్ర హీరోలతో చేస్తున్న సమంత ...మరీ చిన్న పిల్లలా ఉంటుందని అంటున్నారు. నయనతార మంచి ఆప్షన్ అంటున్నారు. చిరంజీవి పుట్టిన రోజైన 22 ఆగస్టున ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన వచ్చే అవకాసం ఉంది. వివి వినాయిక్ నే దర్శకుడుగా ఫైనల్ చేసారంటున్నారు.


Click it and Unblock the Notifications











