రాజకీయాల్లోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవిలో జబర్ధస్త్ స్టార్

ఒకప్పుడు గ్లామర్ ఫీల్డులో అవకాశాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది టాలెంట్ బయటపడుతుంది. ఇలా ఇప్పటికే తెలుగులో చాలా మంది సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరిపోయే పంచులతో హైలైట్ అయిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే....

బుల్లితెరపై సూపర్ స్టార్‌గా
బుల్లితెరపై తిరుగులేని షోగా ఉన్న జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచులు, ప్రాసలతో మెప్పించిన ఇతగాడు.. మిగిలిన వాళ్ల కంటే తక్కువ సమయంలోనే స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఎన్నో షోలలో సందడి చేశాడు.

Hyper Aadi Political Entry News Goes Hot Topic In Telugu States

మూవీల్లోనూ సత్తా చాటేసి
ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా దూసుకుపోతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కనిపించాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో హీరోగా చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ జోష్‌తో వెళ్తున్నాడు.

జబర్దస్త్‌కు గ్యాప్... వాటిలో
బుల్లితెరపై హైపర్ ఆది సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో కనిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ ఇచ్చేశాడు. ఇందులో భాగంగానే తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌కు అతడు గ్యాప్ తీసుకున్నాడు. కానీ, 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు.

Hyper Aadi Political Entry News Goes Hot Topic In Telugu States

హైపర్ ఆది పొలిటికల్‌గా
ఎంతో కాలం నుంచి తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ.. ఇప్పుడు సినీ రంగంలో కూడా తనదైన మార్కును చూపిస్తోన్నాడు హైపర్ ఆది. ఇలా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్న అతడు.. అప్పుడప్పుడూ రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఆది ప్రచారం కూడా నిర్వహించాడు.

రాజకీయాల్లోకి ఎంట్రీతో
ఈ మధ్య కాలంలో పాలిటిక్స్‌కు సంబంధించిన స్పీచ్‌లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న హైపర్ ఆది.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, జూలై మొదటి వారంలోనే అతడు ఆ పార్టీ కండువా కప్పుకుంటాడని అంటున్నారు.

Hyper Aadi Political Entry News Goes Hot Topic In Telugu States

ఆ పదవి ఇస్తున్నారని
హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే అతడి గురించి మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సమాచారం ప్రకారం.. ఈ స్టార్ కమెడియన్‌కు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తున్నారట. ఇదంతా మరో రెండు వారాల్లోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ న్యూస్ నిజమే అయితే హైపర్ ఆది పంట పడినట్లే అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X