హన్సిక నిజ స్వరూపం అదీ?
చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి చెత్త పనులు..అన్నట్లుంది హన్సికను చూస్తూంటే అంటున్నారు ఆమె నిర్మాతలు. ఆమె మీడియా వద్ద నేను పబ్ లకు, పార్టీలకు దూరం సాయింత్ర ఏడు దాటితే ఇంట్లో ఉంటాను. మా మమ్మీ చెప్పిందే వింటాను అంటూ ఇంటర్వూలు ఇస్తుంది. మరో ప్రక్క తన ప్రెండ్స్ తో, హీరోలతో పబ్స్ కి వెళ్ళి పార్టీలు ఇస్తూ బిల్లు మాత్రం మాకు పంపుతోంది అంటున్నారు. ఈ అలవాటు ఆమెకు మొదటి నుంచీ ఉందని అయితే ఎవరూ నోరు విప్పి నడుస్తున్న ప్రాజెక్టును చేజేతులా పాడుచేసుకునే పరిస్ధితి లేదని అందుకే అసలు విషయం బయిటకు రాదు అంటున్నారు.
అయితే హన్సిక వర్గీయులు మాత్రం కొందరు గిట్టని నిర్మాతలు, డేట్స్ దొరకని వారు కావాలని చేసే ప్రచారం ఇది. వారి ఆబ్లిగేషన్స్ ని కన్సిడర్ చేయకపోతే ఇలాంటి పుకార్లు పుట్టించి కెరీర్ కి దెబ్బకొట్టాలని చూస్తారు. వారు చెప్పినట్లు వినలేదని, ఆ కండిషన్స్ ని అనుసరించలేదని ఇలా పబ్స్ అనీ పార్టీలని రకరకాలుగా మాట్లాడుతారు. అయినా రెగ్యులర్ గా ఆమెతో చేసే నిర్మాతను ఆ మాట చెప్పమనండి అని ఛాలెంజ్ విసురుతున్నారు. అంత ధైర్యం ఉన్న నిర్మాత ఎవరుంటారు అనేది అసలు ప్రశ్న.


Click it and Unblock the Notifications











