twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కామెంట్స్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసాయా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సంవత్సరం సిసిఎల్-3 టోర్నీలో ఆడాలని నిర్ణయించుకోవడంతో మెగా అభిమానులంతా చాలా సంబర పడ్డారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సిసిఎల్-3 కార్యక్రమంలో చరణ్ చేసిన కామెంట్స్ అభిమానులను నిరాశ పరిచాయనే వాద వినిపిస్తోంది.

    33 నెంబర్ జెర్సీతో 'తెలుగు వారియర్స్' టీంలో ఆడనున్న రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో పాట్లాడుతూ....నేను పెద్దగా స్కోర్ చేయలేను, తనను 7వ లేదా 8వ బ్యాట్స్ మెన్ గా పంపాలని కెప్టెన్ వెంకటేష్ ను రిక్వెస్ట్ చేసాడు. దీంతో..రచ్చ సినిమాలో మాదిరి రామ్ చరణ్ బ్యాట్ పట్టి సిక్సులు, ఫోర్లు బాదుతుంటే చూసి ఆనందిద్దామని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైనట్లయిందని చర్చించుకుంటున్నారు.

    ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. మార్చి 10న బెంగుళూరులో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. తెలుగు సినీ పరిశ్రమ తరుపున వెంకటేష్ కెప్టెన్సీలో 'తెలుగు వారియర్స్' జట్టు బరిలోకి దిగుతుండగా వివిధ సినీ రంగాల ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్టైకర్స్, బెంగాల్ టైగర్స్, వీర్ మరాఠి, భోజ్ పురి దబాంగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

    రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న జంజీర్ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్. మే నెలలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

    English summary
    "I am not a good cricketer and not good at scoring runs" Ram Chara told. He requested captain Venky to send him either as 7th or 8th batsman in CCL 3. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X