రాణాతో అటువంటిదేమీ లేదని బుకాయిస్తున్న ముదురు హీరోయిన్
లీడర్ తో పరిచయం అయిన రాణా రీసెంట్ గా శ్రేయతో కలిసితిరుగుతున్నాడని, డేటింగ్ చేస్తున్నాడని వినపడింది. అంతేగాక వీరిద్దరూ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రాత్రి పూట కనపడ్డారని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడింది. అయితే ఈ విషయమై ఓ లీడింగ్ మీడియా వారు ఆమెను సంప్రదించి ఆరా తీసారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అసలు రాణా ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు అతనితో లవ్ అంటే ఎలా సమాధానం చెప్పను. అయినా నేను ప్రస్తుతం కుకింగ్ విత్ స్టెల్లా(దీపా మెహతా దర్శకత్వం) లో ప్రెవేట్ స్క్రీనింగ్ నిమిత్తం లండన్ బిజీగా ఉన్నాను అంది. అంతేగాక ఆ తర్వాత ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేస్తూ..నా మీద ఆధారాలు లేని రూమర్స్ చాలా వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. కొంతమంది ఆనందం కోసం వాటిని సృష్టిస్తున్నారు అని వాపోయింది. ఇక శ్రియ ప్రస్తుతం రవితేజ సరసన డాన్ శీను చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. ఇక రాణా...ప్రస్తుతం హిందిలో దమ్ మారో దమ్ అనే చిత్రం చేస్తున్నాడు. అందులో అతని సరసన బిపాసా బసు చేస్తోంది.


Click it and Unblock the Notifications











