మీ కోరిక త్వరలోనే తీర్చుతాను...సమంత హామీ
అందరం అనుకున్నట్టుగానే ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో అట్టహాసంగా జూ ఎన్టీఆర్ బృందావనం ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి అతిరధ మహారధులు హాజరవ్వడం జరిగినది. ఈ సినిమా ఆడియోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సిద్దార్ద హాజరయ్యారు. అంతేకాకుండా హీరోయిన్లు సమంతా, కాజల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ వేడుకలో సమంత ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. దానికి ఆడియన్స్ సమంతాని తెలుగులో మాట్లాడాలని పట్టుపట్టారు. దానితో సమంత కోంచెం ఇబ్బందిపడ్డారు. దానికి కారణం మన సమంతకి తెలుగురావకపోవడమే.
దీని గురించి సమంత తన ట్విట్టర్ లో "నన్ను క్షమించండి. తెలుగులో మాట్లాడలేకపోయా. అక్కడ చాలా మంది పెద్దవారు, అభిమానులు ఉన్నారు. అంత మంది ముందు మాట్లాడడం నాకు కోంచెం భయమేసింది. అందుకే మాట్లాడలేకపోయాను. మీ అందరి కోరిక త్వరలోనే తీరుతుందన్నారు. దానికి కారణం ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నిన్న మాత్రం మిమ్మల్ని నిరత్సాహాపరిస్తేమాత్రం నన్ను క్షమించండి". అంటూ మన అందాల సమంత అందంగా తన ట్విట్టర్ లో అభిమానులను ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











