»   » ఆ హీరో పిలిస్తే చాలు దేనికైనా సిధ్ధం..!

ఆ హీరో పిలిస్తే చాలు దేనికైనా సిధ్ధం..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో ఆయన అంటే అందరకి హాడల్. చాలా సార్లు పోరపాట్లు చేసి కోర్టుకి కూడా హాజరయ్యారు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న కండలహీరో ఇటీవల ఓ దక్షణాది భామ మీద మనసు పారేసుకున్నాడంట. ఆ భామ ఇటీవలే రావణ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ భామ ఎవరో మీకు అర్దం అయ్యేవుంటుంది మన దక్షణాదిన బికినీ లో తమ అందాలను ఆరబోసిన మళయాళ ముద్దుగుమ్మ ప్రియమణి. కండలహీరో సల్మాన్ ఖాన్ మన ప్రియమణి మీద మనసు పారేసుకున్నాడంట.

తన తదుపరి చిత్రం వాంటెడ్ సీక్వెల్ లో ప్రియమణి చేత నటింపజేయడానికి సల్మాన్ ఖాన్ ప్రయత్మిస్తున్నాడంటు ఉహాగానాలు వస్తున్నాయి. ఐతే ఇదంతా తూచ్ అని, త్రిష, ప్రియమణి తో పోల్చినట్లయితే అసిన్ యే బాగుంటుందని అనుకోని అసిన్ వైపే మొగ్గు చూపాడని మరో ఉహాగానం కూడా వుంది.

ఇది ఇలావుండగా రావణ్ తో తనకు బాలీవుడ్ లో ఆశించిన గుర్తింపు దక్కకపోయినా, ఈ సినిమా తనను బాలీవుడ్ జనానికి బాగా పరిచయం చేసిందని, నా తదుపరి చిత్రం రక్తచరిత్ర తో బాలీవుడ్ లో తనకు మంచి గుర్తింపు దక్కతుందని ఈ అమ్మడు ఆశాభావం వ్యక్తం చేసింది.

సల్మాన్ ఖాన్ పిలిచి ఛాన్సిస్తే, రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా, కాల్షీట్స్ ఇచ్చేస్తానని అంటోంది. వాంటెడ్ సీక్వెల్ పై సల్మాన్ ఖాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu