ఐటం గర్ల్ ఇమేజ్ నుండి ప్రక్కకు వచ్చి ఇప్పడిప్పుడే సోలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న ముమైత్ ఖాన్ తాను పూర్తి స్ధాయిలో ట్రాప్ చేయబడ్డానని చెప్తోంది. అయితే ఆమెను ఎవరు ట్రాప్ చేసారు అనేది అడిగితే నిట్టూర్చుతూ నా స్క్రీన్ ఇమేజే అంటోంది. తెరపై తాను వేసే పాత్రలను బట్టి తన పర్శనల్ లైఫ్ ని అంచనా వేస్తున్నారని, నిజానికి వాటికి,తనకీ అసలు నక్కకీ,నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటోంది. అంతే గాక పత్రికలు,మీడియా తనపై గాసిప్స్ రాసి క్యాష్ చేసుకుంటున్నారని వాపోతోంది. అలాగే తాను రెగ్యులర్ గా ప్రేక్షకులు నమ్మి ఆరాధించే చాలా మంది సంప్రదాయబద్ద హీరోయిన్స్ కన్నా మంచి జీవితాన్నే గడుపుతున్నానని వెల్లడిస్తోంది. ప్రస్తుతం టార్గెట్ సినిమాలో బిజీగా ఉన్నామె మరో రెండు ప్రాజెక్టులను ఒప్పుకునేందకు సంసిద్దమవుతోంది. టార్గెట్ సినిమా షరాన్ స్టోన్ నటించిన బేసిక్ ఇన్ స్టెంట్ సినిమాకు ఫ్రీమేక్ గా వస్తోంది.