దుమ్ము దులుపేస్తున్న ఆలీ!
తెలుగులో కామెడీ పండిస్తూ బ్రహ్మానందం తర్వాత మంచి పేరున్న కామెడీ ఆర్టిస్ట్ గా పేరు పొందిన వ్యక్తి 'ఆలీ". ఇందచేట...నా సిగ్గు సిమ్మాలి...గాండీ సిరి గండు పిల్లి, బిలిపిత్తిరి పిల్లి, ప్లాంతర పగిడి, నచిమి, రాంబాబు బాబ్బాబ్బాబు అని, అంటూ అర్థం పర్థం లేని లాంగ్వేజ్ తో ఆంధ్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మనసును దోచుకున్నాడు ఆలీ.
తన కామెడీతో అందరిని నవ్వించే ఆలీ తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. నవ్వించడం నా వత్తి, నవ్వుల పాలు కాకూడదనే బయటకు వచ్చినపుడు గంభీరంగా వుంటానంటూ చెప్తున్నాడు. ఒక్క రూపాయి కూడా లేకుండా సినిమాల్లోకి వచ్చాను. అల్లా దయ వల్ల తిండికీ, బట్టకీ, గూడుకీ ఎటువంటి లోటు లేదు. ప్రజల్ని నవ్వించటంలో ఎంతో ఆనందముంటుంది.
అది కొండంత ఆత్మ స్థైర్యాన్నిస్తుంది. నేను 365 రోజుల్లో ఖాళీగా ఉన్న రోజు లేదేమో! పది నిమిషాలు ఖాళీ దొరికినా చీపురు పట్టుకుని మా ఇంట్లో వాకిలి తుడుస్తుంటాను కానీ, గోళ్లు గిల్లుకోను. టైం చాలా విలువైనది అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు హాస్య నటుడు ఆలీ.


Click it and Unblock the Notifications











